
వర్ణశోభిత సంధ్యవేళ
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకూ భానుడు తన తాపంతో భూమిని దహించగా, సంధ్య వేళకు కోపం వదిలేసి కాంతుల కళలను ఆవిష్కృతం చేశారు. ఎర్రని పువ్వులెరుపుతో నింగిని రంగుల హరివిల్లు చేసి, ప్రకృతి అందాలతో మనసులు మురిపించాడు. బారాషహీద్ దర్గా సమీపంలోని స్వర్ణాల చెరువు వద్ద వినీలాకాశం తనవైపు చూసే ప్రతి చూపును మంత్రముగ్దుల్ని చేసింది. నీలిగగనంలో కుంకుమ పువ్వుల వర్ణం చిమ్మినట్టుగా, నీటిపై ప్రతిబింబించిన ఆ కాంతులు స్వర్ణ శోభితంగా ఆవిర్భవించాయి. ప్రకృతి మాధుర్యాన్ని పెయింటింగ్ వేసినట్టుగా, రంగుల తోరణంగా శనివారం సాయంత్రం వర్ణశోభితంగా మారింది స్వర్ణాల చెరువు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు

వర్ణశోభిత సంధ్యవేళ

వర్ణశోభిత సంధ్యవేళ