
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
నెల్లూరు(టౌన్): ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఆపస్, పీఆర్టీయూ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ బాలాజీరావుకు వినతిపత్రాన్ని శుక్రవారం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు.
ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఎంఈఓ – 1 పోస్టులను ఇవ్వరాదని కోరారు. బదిలీ చేసిన టీచర్లను వీలైనంత త్వరగా రిలీవ్ చేయాలని పేర్కొన్నారు. పాఠశాలలకు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బియ్యాన్ని సరఫరా చేయాలన్నారు. హైస్కూళ్లలో రిటైర్మెంట్ కారణంగా ఏర్పడిన సబ్జెక్ట్ టీచర్ ఖాళీలను వెంటనే వర్క్ అడ్జస్ట్‌మెంట్ లేదా క్లస్టర్ ఉపాధ్యాయులతో భర్తీ చేయాలని విన్నవించారు. ఆపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి అజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.