
గుప్తనిధుల కోసం తవ్వకాలు
సైదాపురం: మండలంలోని తోచాం గ్రామంలో పురాతన శ్రీకృష్ణుని ఆలయంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గురువారం గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతుండగా స్థానికులు పట్టుకునేందుకు ప్రయత్నించగా ఉడాయించాడు. ఊరి పొలిమేరల్లో అమ్మ వారి బొమ్మ వేసి పూజలు చేసిన ఆనవాళ్లను గుర్తించారు. దీంతో గ్రామస్తులు ఆలయానికి వెళ్లి పరిశీలించారు. గుర్తుతెలియని వ్యక్తులు పూజలు చేసి విగ్రహాల వెనుకవైపు తవ్వకాలు చేశారు. కొద్దిరోజుల నుంచి సమీప ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఆలయ పరిసర ప్రాంతలతోపాటు గ్రామంలో సంచరించినట్లు గుర్తించారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.