
నేటి నుంచి తల్లిపాల వారోత్సవాలు
నెల్లూరు(పొగతోట): అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో ఈనెల 1 నుంచి 7వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాలను నిర్వహించాలని ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ సీడీపీఓలను ఆదేశించారు. గురువారం నెల్లూరులోని కార్యాలయంలో సీడీపీఓలతో నిర్వహించిన సమావేశంలో పీడీ మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ తల్లిపాలు పిల్లల ఆరోగ్యానికి, ఎదుగుదలకు ఎంత అవసరమో అవగాహన కల్పించాలన్నారు. పూర్తిస్థాయిలో ప్రతి అంగన్‌వాడీ కేంద్రాల్లో వారోత్సవాలను జరపాలన్నారు. శుక్రవారం కలెక్టర్ ఆనంద్ కార్యక్రమాలను ప్రారంభిస్తారని తెలియజేశారు.