
బెదరని..
అడ్డంకులు అధిగమించి.. కంచెలు ఛేదించి
ప్రసన్న కుటుంబీకులకు ఆత్మీయ పలకరింపు
● ముళ్ల పొదల్లోనూ
కాలినడకన జైలు వద్దకు రాక
● అడుగడుగునా జయహో జగన్ నినాదాలు
● 8 కిలోమీటర్లు..
2.14 గంటల ప్రయాణం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జననేత జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనను విఫలం చేసేందుకు కూటమి నేతలు కుతంత్రాలు పన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకొని ఆంక్షల ఛట్రాన్ని బిగించారు. హెలిప్యాడ్ నుంచి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి వరకు ఎవరూ లేకుండా చేయాలనే దురుద్దేశంతో బారికేడ్లను ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. అయితే వీరి కుట్రలు, పన్నాగాలు జన ప్రభంజనం ముందు చిన్నబోయాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, అభిమానుల జై జగన్, జైజై జగనన్న నినాదాలతో నెల్లూరు హోరెత్తింది.
అడుగడుగునా జనాభిమానం
చెముడుగుంటలోని హెలిప్యాడ్‌కు గురువారం ఉదయం 10.30కు చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డికి పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన జిల్లా కేంద్ర కారాగారానికి 10.58కు చేరుకున్నారు. అక్రమ కేసులతో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖతయ్యారు. జిల్లా కేంద్ర కారాగారం నుంచి 11.26కు బయల్దేరి సుజాతమ్మ కాలనీలోని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి మధ్యాహ్నం 1.40కు చేరుకున్నారు. ఆయనతో పాటు కుటుంబసభ్యులను పరామర్శించారు. టీడీపీ మూకలు సాగించిన విధ్వంసకాండపై వారిని ఆరాతీశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మధ్యాహ్నం 2.48కు అక్కడి నుంచి బయల్దేరి హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. బెంగళూరుకు హెలికాప్టర్‌లో 3.15కు పయనమయ్యారు.
కూటమిలో కలవరం
జాతీయ రహదారి వెంబడి వాహనాలు బారులుదీరాయి. జగనన్నా అంటూ బస్సులు, లారీలు, కార్ల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున నినదించారు. ఆయన్ను చూసేందుకు వృద్ధులు, మహిళలు రోడ్లపైకొచ్చారు. చంద్రబాబు పాలన అత్యంత దారుణంగా ఉందని, తిరిగి మీరే సీఎం కావాలని నినాదాలు చేశారు. తల్లులు తమ పిల్లలకు ఆశీర్వాదం ఇప్పించారు. అశేష జనవాహినికి అభివాదం చేస్తూ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగారు. మొత్తమ్మీద జననేత పర్యటన కూటమి నేతల్లో కలవరాన్ని రేకెత్తిస్తోంది. పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, మేరిగ మురళీధర్, లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ గురుమూర్తి, జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, మాజీ మంత్రులు నారాయణస్వామి, అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మేకపాటి విక్రమ్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, బుర్రా మదుసూధన్‌యాదవ్, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, నెల్లూరు రూరల్, ఉదయగిరి, వెంకటగిరి సమన్వయకర్తలు ఆనం విజయకుమార్‌రెడ్డి, మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, కొండూరు అనిల్‌బాబు, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, మలిరెడ్డి కోటారెడ్డి, కాకాణి పూజిత, అనిల్‌కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అణువణువూ నిఘా
జిల్లా జైలు ప్రాంతం నుంచి ప్రసన్న ఇంటి వరకు దారిపొడవునా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలతో పోలీసులు నిఘా పెట్టారు. జగన్‌మోహన్‌రెడ్డి భద్రత కంటే.. జనాన్ని కట్టడి చేసేందుకే ప్రాధాన్యమిచ్చారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాకతో సింహపురి జన ఝరిగా మారింది. రాప్తాడు.. పొదిలి.. రెంటపాళ్ల.. బంగారుపాళ్యం.. ఇలా పర్యటన.. పర్యటనకు మించిన జన సునామీ నెల్లూరును తాకడం కూటమి నేతల్లో వణుకు పుట్టించింది. జననేత పర్యటనను అడ్డుకునేందుకు ఊరూరా ఆంక్షలు విధించినా.. పెద్ద సంఖ్యలో చెక్‌పోస్ట్‌లు.. అడుగడుగునా బారికేడ్లు.. ముళ్ల, ఇనుప కంచెలను నెలకొల్పినా.. రహదారులను ధ్వంసం చేసినా, ఇవేవీ పార్టీ అభిమానులను అడ్డుకోలేకపోయాయి. వారిని నిర్బంధించలేకపోయాయి. పార్టీ శ్రేణులు, ప్రజలను కట్టడి చేసేందుకు అనేక అడ్డంకులు సృష్టించినా.. ఖాకీలు లాఠీలను ఝళిపించినా.. ఊహించని స్థాయిలో పోటెత్తారు.
జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనతో నెల్లూరు నగరం జనసంద్రమైంది. ఆంక్షలు, అడుగడుగునా అవాంతరాలను పోలీసులు సృష్టించినా, పార్టీ శ్రేణు లు, అభిమానులు ఏ మాత్రం లెక్క చేయలేదు. రెండుసార్లు లాఠీచార్జి చేసినా బెదరలేదు. తమ అభిమాన నేతను చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. జిల్లా కేంద్ర కారాగారం నుంచి సుజాతమ్మ కాలనీలోని ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి చేరుకునేందుకే దాదాపు రెండు గంటలకుపైగా సమయం పట్టిందంటే ఏ స్థాయిలో అభిమానులు తరలివచ్చారో అర్థం చేసుకోవచ్చు. ఎండను సైతం లెక్కచేయకుండా ఉప్పెనలా తరలివచ్చారు. కాన్వాయ్ వెంబడి జై జగన్, జయహో జగన్.. సీఎం.. సీఎం అని నినదిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.

బెదరని..

బెదరని..

బెదరని..

బెదరని..