
అనుమతులున్నా.. అడ్డుకొని
వెంకటాచలం: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటనకు కూటమి ప్రభుత్వం అడ్డంకులు సృష్టించింది. నెల్లూరు కేంద్ర కారాగారం వద్ద ఆయన దిగే హెలిప్యాడ్ వద్దకు అనుమతులతో వెళ్లే వారిని సైతం అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. వాస్తవానికి హెలిప్యాడ్ వద్దకెళ్లేందుకు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరెడ్డి, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కుమార్తె పూజితకు పోలీసుల అనుమతి ఉంది. అయినా వీరి కార్లను జాతీయ రహదారిపైనే నిలిపేశారు. పూజిత కారులోని మహిళా సిబ్బందిని దింపేసి వెళ్లాలంటూ హుకుం జారీ చేశారు. మహిళా సిబ్బందిని తమ వెంట తీసుకెళ్లనీయరానంటూ ఖాకీలను ఆమె ప్రశ్నించారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం తగదని ఆమె హితవు పలికారు. మీడియాపైనా ఆంక్షలు విధించి జాతీయ రహదారి వద్దే నిలిపేశారు. కార్లను నిలిపి తనిఖీ చేస్తుండగా.. ఫొటోలు, వీడియోలు తీసి న విలేకరులపై అసహనాన్ని ప్రదర్శించారు.
నెల్లూరులో
రెడ్‌బుక్ కర్ఫ్యూ
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నగరంలోని ప్రతి సెంటర్‌లో పోలీసులు బారికేడ్లు పెట్టి ప్రజలకు తీవ్ర ఇబ్బంది కల్పించారు. నగరంలోని ప్రధాన కూడళ్ల మొదలుకొని చిన్న వీధుల్లోనూ పోలీసులను మోహరించారు. ఉదయం ఐదు గంటల నుంచే అన్ని ప్రాంతాల్లో ప్రజల రాకపోకలపై ఇబ్బందులు సృష్టించడంతో సామాన్యులు ఇబ్బంది పడ్డారు. టూవీలర్స్‌ను కూడా వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడం, షాపులు మూయించేయడంతో నగరమంతా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడే వాహనాలను నిర్దాక్షిణ్యంగా నిలిపివేశారు. స్కూళ్లు, డ్యూటీలు, పనులకు వెళ్లేందుకు స్థానికులు అష్టకష్టాలు పడ్డారు.

అనుమతులున్నా.. అడ్డుకొని