
కుటుంబాల్లో బెల్టు షాపుల చిచ్చు
ఉదయగిరి: కూటమి ప్రభుత్వం గ్రామగ్రామాన బెల్టు షాపులు ఏర్పాటు చేసి పచ్చని సంసారాల్లో చిచ్చురేపి నాశనం చేస్తోందని ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శివమ్మ, మస్తాన్‌బీ అన్నారు. వారు గురువారం మండలంలోని కృష్ణారెడ్డిపల్లెలో జరిగిన ఉదయగిరి ప్రాంత ఐద్వా 3వ మహాసభలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో గ్రామాల్లో మంచినీరు దొరకపోయినా పుష్కళంగా దొరుకుతోందన్నారు. బెల్టు షాపులతో మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వాటిని అరికట్టాల్సిన ప్రభుత్వ అధికారులు మిన్నకుండిపోవడం దారుణమన్నారు. కూటమి నేతలు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. భవిష్యత్‌లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. అనంతరం 13 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం బెల్టు షాపులు ఎత్తివేయాలని ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఎంపీటీసీ విజయమ్మ, నాయకులు కామాక్షమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.