
జిల్లా పరిషత్‌లో పదోన్నతులు
నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలో పనిచేస్తున్న ఆరుగురు సీనియర్ సహాయకులకు పదోన్నతులు కల్పించారు. ఉత్తర్వులను జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, సీఈఓ మోహన్‌రావు గురువారం అందించారు. వెంకటరమణయ్య, సీహెచ్ రామకృష్ణ, షేక్ ఇలియాజ్, ఎం.లీలామోహన్, ఎం.సుదర్శన, ప్రసన్నకుమార్ ప్రమోషన్ పొందిన వారిలో ఉన్నారు.
కారుణ్య నియామకాలు
ఇద్దరు ఉద్యోగాలు మరణించగా వారి కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించారు. ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ 2024 ఏడాది నుంచి ఇప్పటివరకు వివిధ హోదాల్లో పనిచేస్తున్న 120 మందికి పదోన్నతులు కల్పించామన్నారు. 81 మంది ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకాల ద్వారా అవకాశాలు ఇచ్చామన్నారు. ఉద్యోగులు, పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నాయకులు లక్కాకుల పెంచలయ్య, వి.ప్రసన్న కుమార్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.