
5,489 కొత్త పింఛన్ల మంజూరు
నెల్లూరు(పొగతోట): జిల్లాలో 5,489 కొత్త పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని డీఆర్‌డీఏ పీడీ నాగరాజకుమారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. శుక్రవారం నుంచి సాధారణ పింఛన్‌తోపాటు కొత్తవి పంపిణీ చేస్తామని తెలియజేశారు.
పురాతన
ఆలయ పరిశీలన
సోమశిల: చేజర్ల మండల పరిధిలోని పెరుమాళ్లపాడు పెన్నా నదిలో బయటపడిన నాగేశ్వరస్వామి ఆలయాన్ని గురువారం రాష్ట్ర దేవదాయ శాఖ స్థపతి పరమేశ్వరప్ప పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణం కోసం అవసరమైన నిధులు, స్థల పరిస్థితులు, నిర్మాణ అవసరాలు, పురాతన శిల్పకళ ప్రాముఖ్యత, సంబంధించిన వాటిపై ఆధ్యయనం చేసి, తగిన ప్రతిపాదనలతో నివేదిక సిద్ధం చేశామన్నారు. ఆయన వెంట సహాయ స్థపతి సురేంద్ర, గుంటూరు జిల్లా డీఈఈ సీహెచ్ శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా ఏఈఈ ఎ.మురళిమోహన్ తదితరులు పాల్గొన్నారు.