
దర్జాగా భూకబ్జా
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నుంచి తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. కలువాయి మండలంలోని తెలుగురాయపురంలో భూకబ్జా వ్యవహారం బుధవారం వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు.. ఆ గ్రామంలోని 582, 586, 590, 593, 576, 577, 578 తదితర సర్వే నంబర్లలో సుమారు 130 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. దానిపై కూటమి నేతల కన్ను పడింది. ఈ వ్యవహారంపై ఏప్రిల్ 25వ తేదీన సాక్షిలో ‘బాబోయ్.. భూచోళ్లు’ అనే కథనం ప్రచురితం కావడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ భూముల్లో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. తిరిగి మే 7వ తేదీన బోర్డులను తొలగించి భూమిని చదును చేసేందుకు తమ్ముళ్లు రంగం సిద్ధం చేశారు. ప్రజలు తహసీల్దార్‌కు సమాచారం అందించాలని చూశారు. అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెబుతున్నారు. పక్కరోజు చదును చేస్తున్న భూముల వద్దకు సర్పంచ్ రమణమ్మ, మాజీ ఎంపీటీసీ సభ్యుడు బి.నారాయణరెడ్డితోపాటు మరికొందరు వెళ్లారు. హిటాచీ ఆపరేటర్ ప్రజల్ని చూసి వెళ్లిపోయాడు. తాజాగా తెలుగురాయపురం, తోపుగుంట అగ్రహారానికి చెందిన నేతలు దర్జాగా పదెకరాల భూమిని చదును చేసుకుని తమ గుప్పిట్లోకి తీసుకున్నారు.
నెల్లూరు పౌల్ట్రీ
అసోసియేషన్ ధరలు
బ్రాయిలర్: రూ.124
లేయర్ రూ.112
బ్రాయిలర్ చికెన్: రూ.224
స్కిన్‌లెస్ చికెన్: రూ.248
లేయర్ చికెన్: రూ.190
నిమ్మ ధరలు (కిలో)
పెద్దవి : రూ.24
సన్నవి : రూ.15
పండ్లు : రూ.5

దర్జాగా భూకబ్జా