
అర్జీలపై అధికారుల విచారణ
ఉలవపాడు: కరేడు గ్రామంలో ఈనెల 4వ తేదీన జరిగిన గ్రామసభలో రైతులు అందించిన అర్జీలపై బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాజశేఖర్, తహసీల్దార్ శ్రీనివాసరావు విచారణ నిర్వహించారు. వారు ప్రత్యుత్తరంగా మరో అర్జీని చేసి అందించారు. 18వ తేదీ వరకు తమకు సమయం ఉంది కాబట్టి, ఆ గడువులోపు అభ్యంతరాలు తెలియజేస్తామన్నారు. మొత్తం 632 మంది రైతులు ఇదే విధంగా అర్జీని తయారుచేసి అందించారు. కరేడు రైతులు భారీగా తరలివస్తారనే సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.