
తండ్రిని చూసి వస్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో
కానిస్టేబుల్ మృతి
నెల్లూరు(క్రైమ్): రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ మృతిచెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున నెల్లూరు ప్రశాంతినగర్ వద్ద చోటుచేసుకుంది. నార్త్ ట్రాఫిక్ పోలీసుల కథనం మేరకు.. నవాబుపేట పోలీసు క్వార్టర్స్‌లో జి.శివకుమార్ (43), స్వరూప దంపతులు నివాసం ఉంటున్నారు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. శివకుమార్ నవాబుపేట పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు విడవలూరు మండలం ముదివర్తిలో ఉంటున్నారు. మంగళవారం శివకుమార్ తన తండ్రిని చూసి వస్తానని భార్యతో చెప్పి ముదివర్తికి వెళ్లాడు. అక్కడి నుంచి బుధవారం తెల్లవారుజామున బైక్‌పై నెల్లూరుకు బయలుదేరాడు. ప్రశాంతినగర్ జంక్షన్ దాటి కొద్దిదూరం వచ్చేసరికి బైక్ మరమ్మతులకు గురైంది. దీంతో అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుండగా గుర్తుతెలియని వాహనం శివకుమార్‌ను ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న నార్త్ ట్రాఫిక్, నవాబుపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్వరూప నార్త్ ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. శివకుమార్ మృతికి ఏపీ పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు మద్దిపాటి ప్రసాదరావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు వై.శ్రీహరి సంతాపం తెలిపారు.