
అభిమాన కెరటాన్ని ఆపలేరు
నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట): మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకుని కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ ధ్వజమెత్తారు. జగననన్న పర్యటనకు వచ్చే అభిమాన కెరటాన్ని అడ్డుకోవాలనుకుంటే ఎవరైనా జనసంద్రంలో కొట్టుకుపోతారన్నారు. పొదలకూరురోడ్డులోని సుజాతమ్మ కాలనీలోని మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసంలో బుధవారం అనిల్‌కుమార్‌యాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఓ మాజీ మంత్రి అక్రమ అరెస్ట్‌లు, మరో మాజీ మంత్రి ఇంట్లో విధ్వంసాలు జరిగితే పరామర్శించేందుకు వస్తున్న జగనన్నను చూస్తే అధికారంలో ఉన్న వారికి ఎందుకింత భయమో అర్థం కావడం లేదన్నారు. నెల్లూరు జిల్లా మొదటి నుంచి వైఎస్సార్‌సీపీకి కంచుకోట. బాబు అబద్ధాలను, మోసాలను సంవత్సరంలోపే ప్రజలు గుర్తించడంతో జగనన్న ఎక్కడకు వచ్చినా విపరీతంగా అభిమానులు వస్తున్నారన్నారు. అభిమానుల రాకను తట్టుకోలేక కూటమి ప్రభుత్వం పోలీసులతో ఎప్పు డూ లేని విధంగా చేస్తుందన్నారు. 46 మండలాల్లో ఎస్సైలతో ప్రెస్‌మీట్లు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. మీటింగ్‌లకు వస్తే అరెస్ట్ చేస్తామని నోటీసులు ఇచ్చారంటే ఎంత కుట్రో ప్రజల కు అర్థమైందన్నారు. ఈ నోటీసులు ఇవ్వడంతో రెట్టించిన ఉత్సాహంతో అభిమానులు, కార్యకర్తలు తమ నాయకుడిని చూసేందుకు వస్తున్నారని తెలిపారు. జిల్లాలో తడ నుంచి సీతారామపురం, కందుకూరు వరకు ప్రతి మారుమూల ప్రాంతం నుంచి అభిమానులు తరలిరావాలని పిలుపునిచ్చారు. ఆంక్షలు విధించే కొద్ది అభిమానులు జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు విపరీతంగా వస్తున్నారని, వారిని ఎవరూ ఆపలేరన్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నా ఎవరూ భయపడడం లేదని తెలిపారు. రాజకీయాలు కొంత మందికి కొత్త అని, రాజకీయాల్లో శాశ్వతం ఉండదని, గతంలో తాము అధికారంలో ఉన్నామని, ఇప్పుడు మోసపూరి త హామీలతో అధికారంలోకి వచ్చారన్నారు. పాలన వదిలేసి పోలీసులతో భయపెట్టి ఎంత మందిని ఆపగలరన్నారు. అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తానంటే తనకు భయమేమి లేదని, జైలుకు వెళ్లేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు అందరిపై కేసులు పెడితే ఉన్న జైలు చాలవని, ప్రభుత్వం కొత్త జైలును కట్టించుకోవాల్సి వస్తుందన్నారు. 4వ తేదీన తనను అరెస్ట్ చేస్తారని చాలా మంది రాజకీయ ఊహాగానాలు చేస్తున్నారన్నారు. అక్రమ అరెస్ట్‌లకు తాను భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రభు త్వం చేసిన అరాచకాలను, వాటికి గురైన బాధితులను పరామర్శించేందుకు వస్తున్న తమ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనలో జిల్లా ప్రజలు తమ సత్తా చాటాలని, ఈ దెబ్బకు కూటమి ప్రభుత్వానికి జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కార్యకర్తలు, అభిమానులు అంటే ఏమిటో తెలిసి వస్తుందని తెలిపారు. ఏ బెదిరింపులకు భయపడకుండా ప్రతి ఒక్కరూ జగనన్న పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
జగనన్న పర్యటనను అడ్డుకునేందుకు ప్రభుత్వం, పోలీసులు కుట్రలు
జిల్లా వైఎస్సార్‌సీపీకి కంచుకోట
కేసులకు భయపడే వాళ్లు ఎవరూ లేరు
నెల్లూరు జనసంద్రంగా మారుతోంది
మాజీ మంత్రి పొలుబోయిన
అనిల్‌కుమార్