
31న నల్లపరెడ్డి నివాసానికి వైఎస్ జగన్ రాక
● భద్రతా ఏర్పాట్లపై చర్చించిన డీఎస్పీలు
నెల్లూరు (క్రైమ్): మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 31న నెల్లూరు నగరంలోని సుజాతమ్మకాలనీలో ఉన్న మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి రానున్నారు. ప్రసన్న ఇంటిని టీడీపీ రౌడీమూకలు ధ్వంసం చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో నల్లపరెడ్డితోపాటు ఆయ న కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు నగర, రూరల్ డీఎస్పీలు పి.సింధుప్రియ, ఘట్టమనేని శ్రీనివాసరావు తమ సిబ్బందితో కలిసి సోమవారం ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వచ్చారు. పర్యటన ఏర్పాట్లు, భద్రత తదితర అంశాలపై వారు ప్రసన్నకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, నెల్లూరు రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డితో కలిసి చర్చించారు.