
31న వైఎస్ జగన్ నెల్లూరు రాక
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఈ నెల 31వ తేదీ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటన ఖరారైనట్లు ఆ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి ఆదివారం తెలిపారు. 31వ తేదీ గురువారం ప్రత్యేక హెలికాప్టర్‌లో నెల్లూరు చెముడుగుంట జిల్లా సెంట్రల్ జైలు సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారని, అక్కడి నుంచి నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ముఖాఖత్ అయి పరామర్శిస్తారన్నారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి, అనంతరం హెలిప్యాడ్‌కు చేరుకుని తాడేపల్లికి బయలుదేరుతారని తెలిపారు.
హెలిప్యాడ్ పరిశీలన
వెంకటాచలం: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారైన నేపథ్యంలో ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి, తలశిల రఘురాం ఆదివారం వెంకటాచలం మండలం చెముడుగుంటలోని జిల్లా సెంట్రల్ జైలు సమీపంలోని హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి నెల్లూరులోని మాజీమంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి జగన్ వెళ్లనుండడంతో ఏర్పాట్లపై చర్చించారు. వీరి వెంట పార్టీ ముఖ్య నేతలు తదితరులు ఉన్నారు.
సబార్డినేట్ లెజిస్లేటివ్ కమిటీ సభ్యుడిగా పర్వతరెడ్డి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి జాయింట్ కమిటీలో 2025–26 సంవత్సరంలో సబార్డినేట్ లెజిస్లేటివ్ సభ్యుడిగా వైఎస్సార్‌సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కమిటీ సెక్రటరి జనరల్ ప్రసన్నకుమార్ సూర్యదేవర ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.

31న వైఎస్ జగన్ నెల్లూరు రాక

31న వైఎస్ జగన్ నెల్లూరు రాక