
పెద్దాస్పత్రిలో ఉచిత పరీక్షలు, వైద్యం
నెల్లూరులోని సర్వజన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో పెద్ద సంఖ్యలో ఉచిత స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నాం. ముందస్తుగా ఎవరైనా వచ్చి హెపటైటిస్ వైరల్ పరీక్షలు చేయించుకోవచ్చు. ఇందుకు ఒక విభాగాన్ని ఏర్పాటు చేశాం. ఎవరికై నా పాజిటివ్ వస్తే వారికి మళ్లీ వైరల్ లోడ్ పరీక్షలు చేస్తాం. ఖరీదైన మందులు ఉచితంగా అందజేస్తాం. మందులు వాడటం ద్వారా వ్యాధి ముదరకుండా నియంత్రణ చేయొచ్చు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరూ ముందస్తుగా టీకాలు వేయించుకోవాలి.
– డాక్టర్ కొండేటి మాధవి, సూపరింటెండెంట్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి