
విద్యతోనే సమాజంలో గౌరవం
● ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు
నెల్లూరు(బృందావనం): విద్యతోనే సమాజంలో గౌరవం లభిస్తుందన్న విషయాన్ని ప్రతి విద్యార్థి తెలుసుకుని కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలని ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ తిరగాబత్తిన శ్రీనివాసరావు తెలిపారు. పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చూపిన గౌడ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రదానం కార్యక్రమాన్ని జిల్లా గౌడ కల్లుగీత పారిశ్రామికుల సంఘం, గౌడ సేవా సమితి ట్రస్ట్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కోసూరు రాజశేఖర్‌గౌడ్ ఆధ్వర్యంలో నెల్లూరులోని పురమందిరంలో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కల్లుగీత పారిశ్రామికుల సంఘం జిల్లా అధ్యక్షుడు తోట ప్రభాకర్‌గౌడ్ మాట్లాడుతూ దివంగత కోసూరు గోవిందయ్య ట్రస్ట్ తరఫున విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున ప్రోత్సాహక నగదుతోపాటు విద్యాసామగ్రి అందజేస్తున్నామన్నారు. ఈ ఏడాది 193 మందికి ఇచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో గౌడ సంఘ నేతలు రావుల దశరథరామయ్యగౌడ్, నాయుడు రామ్‌ప్రసాద్‌గౌడ్, డాక్టర్ బడుగు కృష్ణమూర్తి గౌడ్, డాక్టర్ బి.మాధవులు, డాక్టర్ వెంకటాచలపతిగౌడ్, ప్రొఫెసర్ రావుల లావణ్యగౌడ్, దిశ పోలీస్‌స్టేషన్ డీఎస్పీ రామారావుగౌడ్, సీఐ జగన్‌మోహన్‌రావు తదితరులు పాల్గొన్నారు.