
వైద్యశాలకు వెళ్తుండగా..
● రోడ్డు ప్రమాదంలో అధ్యాపకురాలి మృతి
కందుకూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందగా, ఆమె కుమారుడు గాయపడిన ఘటన మండలంలోని ఓగూరు సమీపంలో 167–బీ జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. కందుకూరు కోవూరు రోడ్డులోని యర్రగుంటపాళేనికి చెందిన పఠాన్ షాజిదా బేగం (55) తన కుమారుడు తబీన్‌తో కలిసి ఒంగోలులోని వైద్యశాలకు వెళ్తున్నారు. అది వారి సొంత కారు. తబీన్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఓగూరు సమీపంలోని రవి గార్డెన్ వద్ద డీసీఎం లారీ వేగంగా వెళ్తోంది. డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేశాడు. దీంతో వెనుక వస్తున్న కారు దానిని ఢీకొట్టింది. షాజిదా బేగం తీవ్రంగా గాయపడ్డారు. ఆమెను 108 అంబులెన్స్‌లో ఒంగోలు వైద్యశాలకు తరలిస్తుండగా మృతిచెందారు. తబీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. షాజిదా బేగం దొనకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నారు. ఆమెకు భర్త, ముగ్గురు పిల్లలున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. విచారణ చేస్తున్నట్లు కందుకూరు రూరల్ పోలీసులు తెలిపారు.

వైద్యశాలకు వెళ్తుండగా..