
ఘనంగా కృష్ణచైతన్య సక్సెస్ మీట్
నెల్లూరు(టౌన్): కృష్ణచైతన్య విద్యాసంస్థలు నాక్ అక్రిడిటేషన్, యూజీసీ అటానమస్ సాధించడంతో నెల్లూ రులోని అనిత ఆడిటోరియంలో ఆదివారం సక్సెస్ మీట్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, డైరెక్టర్ కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ కృష్ణచైతన్య విద్యాసంస్థలు క్రమశిక్షణ కలిగిన విద్యావిధానానికి స్ఫూర్తిగా నిలుస్తున్న ట్లు చెప్పారు. అనంతరం అక్రిడిటేషన్, యూజీసీ అటానమస్ సాధించడానికి కృషి చేసిన అధ్యాపకులు, అ ధ్యాపకేతర సిబ్బందిని ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విద్యాసంస్థల డీన్ రామాంజనేయులురెడ్డి, డిగ్రీ కళాశాలల డీన్ సుధారాణి, పీజీ కళాశాలల డీన్ జ్యోతి, ప్రిన్సిపల్ నాగయ్య, హెచ్‌ఓడీలు పాల్గొన్నారు.