
అవగాహనతోనే చెక్
సీ వైరస్‌కు కొత్తగా చికిత్స అందుబాటులోకి వచ్చింది. పరీక్షలు చేయించుకుని మూడునెలలు మందులు వాడాలి. బీ వైరస్‌ను నయం చేయలేం. అయితే వైరల్ లోడ్ పెరగకుండా మూడు నుంచి నాలుగేళ్లు డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడాలి. ప్రజల్లో అవగాహన పెరగాలి. ముందస్తుగా రక్తపరీక్షలు చేయించుకుని వ్యాధి ఉందో? లేదో? తెలుసుకోవాలి. లేనివారు వ్యాక్సిన్ వేయించుకోవాలి. గర్భిణికి వైరస్ ఉంటే బిడ్డ పుట్టిన రోజే ఇమ్యునో గ్లోబులిన్ ఇంజెక్షన్ వేయించాలి.
– డాక్టర్ సునీల్‌కుమార్, హెపటైటిస్ జిల్లా నోడల్ ఆఫీసర్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి