జిల్లాలో ఇలా.. | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఇలా..

Jul 26 2025 8:58 AM | Updated on Jul 26 2025 10:30 AM

జిల్ల

జిల్లాలో ఇలా..

అందుబాటులో ఉంచాం

రైతుల అవసరాల నిమిత్తం సొసైటీలు, ప్రైవేట్‌ ఏజెన్సీల ద్వారా యూరియాను సరఫరా చేశాం. మోతాదుకు మించి వినియోగించకూడదు. ఐఏబీ తీర్మానం ప్రకారం 3.60 లక్షలు, మరో 40 వేల ఎకరాలకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాం. ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి. అధిక ధరలకు అమ్మేవారిపై చర్యలు తీసుకుంటాం. రైతులు ముందుకొచ్చి సమస్యలపై ఫిర్యాదు చేయాలి.

– సత్యవాణి,

జిల్లా వ్యవసాయశాఖాధికారిణి

● అనంతసాగరం మండలానికి చెందిన రమణయ్య అనే రైతు 8 ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. యూరియా కోసం పడరాని పాట్లు పడ్డారు. సొసైటీలో దొరక్కపోవడంతో ప్రైవేట్‌ ఏజెన్సీల వద్ద బస్తా రూ.350కు కొనుగోలు చేశారు.

● సంగం మండలం అన్నారెడ్డిపాళేనికి చెందిన శ్రీనివాసులు అనే రైతు ఆరున్నర ఎకరాల్లో వరి పంట సాగు చేశారు. యూరియా కోసం బుచ్చిరెడ్డిపాళెం, సంగం, దువ్వూరు తదితర ప్రాంతాల్లో తిరిగి అలిసిపోయి ప్రైవేట్‌ ఏజెన్సీల వద్ద బస్తా రూ.380 పెట్టి కొన్నారు.

నెల్లూరు(పొగతోట): జిల్లాలో వరిపంట సాగు చేస్తున్న రైతులు యూరియా కోసం యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాడు వైఎస్సార్‌సీపీ హయాంలో యూరియాను రైతు భరోసా కేంద్రాల ద్వారా సకాలంలో అందించారు. కానీ కూటమి ప్రభుత్వంలో ముందస్తు ప్రణాళిక లేదనే విమర్శలున్నాయి. సరిపడా నిల్వ చేయడంలో వైఫల్యం చెందింది. అధికారుల కాకిలెక్కల పుణ్యమా అంటూ రైతులు రోడ్డెక్కిన నిరసన కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితులున్నాయి.

ఇదీ పరిస్థితి

జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారం 3.60 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తున్నారు. చెరువులు, కుంటల కింద అనధికారికంగా మరో లక్ష ఎకరాల్లో పంట సాగవుతోంది. ఐఏబీ సమావేశంలో 3.60 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేస్తున్నట్లు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ప్రకటించారు. దానికి అనుగుణంగా వ్యవసాయ శాఖాధికారులు యూరియా, ఇతర ఎరువులను నిల్వ చేయాలి. కానీ నేడు యూరియా అందక రైతులు గగ్గోలు పెడుతున్నారు. సొసైటీలు, ప్రైవేట్‌ ఏజెన్సీల ద్వారా యూరియా విక్రయాలు కొనసాగుతున్నాయి. ఐదు బస్తాలు కావాలంటే లిక్విడ్‌ యూరియాను తప్పనిసరిగా తీసుకోవాలని నిబంధన పెట్టారు. అయితే దానిపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో వ్యతిరేకిస్తున్నారు.

సరఫరా చేశామని చెబుతున్నా..

సొసైటీల్లో ఎమ్మార్పీ ధరలకే యూరియాను విక్రయిస్తున్నారు. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో స్టాక్‌ లేదు. రైతు సేవా కేంద్రాల ద్వారా సరఫరా చేయడం లేదు. దీంతో ప్రైవేట్‌ ఏజెన్సీలు ఇష్టానుసారంగా అధిక ధర వసూలు చేస్తున్నాయి. దీని గురించి వ్యవసాయ శాఖాధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొరత నేపథ్యంలో రవాణా చార్జీలు తదితరాలను సాకుగా చూపి ఎక్కువ రేటు అమ్ముతున్నారు. కొందరు రైతులు అవసరానికి మించి నిల్వ చేసుకుంటున్నారని, అందువల్లే కొరత ఏర్పడుతోందని అధికారులు చెబుతున్న మాట. కాగా బుధవారం జరిగిన డీఆర్సీ సమావేశంలో కూటమికి చెందిన ఎమ్మెల్యేలే జిల్లా వ్యాప్తంగా యూరియా కొరతతో రైతులు ఆందోళన చేస్తున్నారన్నారు. అధిక ధరలకు అమ్ముతున్నా అధికారులు ఏం చేస్తున్నారని అడిగారు. మొదటిసారి రెండో పంటకు యూరియా కొరత వచ్చిందన్నారు. యూరియాను పూర్తిస్థాయిలో రైతులకు అందించేందుకు వ్యవసాయ శాఖాధికారులు ఎటువంటి ప్రత్యేక చర్యలు తీసుకోలేదు. అవసరానికి అనుగుణంగా సరఫరా చేస్తున్నామని కాకిలెక్కలు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులను కప్పిపుచ్చి క్షేత్రస్థాయిలో సమస్యలను గుర్తించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

డిమాండ్‌ ఎంతంటే.. :

47,588 మెట్రిక్‌ టన్నులు

ఇప్పటి వరకు సరఫరా చేసింది :

36,994.34 మెట్రిక్‌ టన్నులు

అన్నదాతలను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. అధికారులు చెబుతున్న మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు పొంతన ఉండటం లేదు. కొరత లేదని ఓవైపు అధికారులు చెబుతుంటే మరోవైపు సాక్షాత్తు అధికార పార్టీ ఎమ్మెల్యేలే రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఇప్పటికే పలుచోట్ల యూరియా కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేసిన సందర్భాలున్నాయి.

అవస్థలు పడుతున్న రైతులు

రోడ్డెక్కి ఆందోళన చేస్తున్న వైనం

3.60 లక్షల ఎకరాల్లో వరి సాగు

అనధికారికంగా

మరో లక్ష ఎకరాల్లో..

అధిక ధరలకు

విక్రయిస్తున్న ప్రైవేట్‌ ఏజెన్సీలు

జిల్లాలో ఇలా.. 1
1/1

జిల్లాలో ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement