5 కేజీల గంజాయి స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

5 కేజీల గంజాయి స్వాధీనం

Jul 26 2025 8:58 AM | Updated on Jul 26 2025 10:28 AM

5 కేజీల గంజాయి స్వాధీనం

5 కేజీల గంజాయి స్వాధీనం

నెల్లూరు(క్రైమ్‌): గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. రైల్వే డీఎస్పీ జి.మురళీధర్‌ తన కార్యాలయంలో నిందితుడి వివరాలను వెల్లడించారు. శుక్రవారం నెల్లూరు ప్రధాన రైల్వేస్టేషన్‌లో తనిఖీలు చేపట్టారు. టాటానగర్‌ – ఎర్నా కుళం జంక్షన్‌ వెళ్లే రైలు నుంచి దిగి ప్లాట్‌ఫారంపై అనుమానాస్పదంగా ఉన్న తమిళనాడు రాష్ట్రానికి చెందిన వి.మనోజ్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. అత ని బ్యాగ్‌లోని 5 కేజీల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని రైల్వే ఎస్సై ఎన్‌.హరిచందన కేసు నమోదు చేశారు. సమావేశంలో నెల్లూరు సీఐ ఎ.సుధాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement