
మున్సిపల్ కార్మికుల భారీ ర్యాలీ
నెల్లూరు(బారకాసు): నెల్లూరు నగరపాలక సంస్థలో పారిశుద్ధ్య పనులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు 9వ డివిజన్లో పిలిచిన టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో గురువారం కార్మికులు భారీ ర్యాలీ చేశారు. నెల్లూరులోని గాంధీ బొమ్మ వద్ద నుంచి వీఆర్సీ సెంటర్ వరకు ఇది జరిగింది. ఈ సందర్భంగా ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మున్సి పల్ కార్మికులను ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేయడం దుర్మార్గమన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి నారా యణ నియోజకవర్గంలో టెండర్లు పిలవడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నేతలు నాగభూషణం, జ్యోతిబసు, కత్తి శ్రీనివాసులు, కొండా ప్రసాద్, కె.పెంచలనరసయ్య, జి.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.