
అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘నేను అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అధికార దుర్వినియోగానికి పాల్పడలేదు. ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో అత్యంత గౌరవ భావంతో వ్యవహరించాను. ఏ రోజు నా రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులు పెట్టమని పురమాయించనూ లేదు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక, ధైర్యం లేక నేను వారి అవినీతిని ప్రస్తావించడాన్ని తట్టుకోలేక, నన్ను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వ సహకారంతో నాపై మోపుతున్న అనేక అక్రమ కేసులు పరంపరలో భాగంగానే ఇది మరో అక్రమ కేసు. అంతే తప్ప ఈ కేసులో ఎలాంటి వాస్తవాలు లేవు’ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎకై ్సజ్ శాఖ అధికారుల ప్రశ్నలకు సూటిగా సమాధామిచ్చారు. పొదలకూరు మండలం ఇరువూరులో మద్యం అక్రమ నిల్వల కేసులో కోర్టు ఆదేశాల మేరకు మాజీ మంత్రి కాకాణిని రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని విచారణ జరిపారు. పోలీస్ శిక్షణా కేంద్రంలో రెండో రోజు మంగళవారం ఎకై ్స జ్ అధికారులు విచారణ చేపట్టారు. రెండో రోజు 25 ప్రశ్నలకు కాకాణి దీటుగా సమాధానం ఇవ్వడంతోపాటు కాకాణి ప్రశ్నలకు నీళ్లు నమలాల్సి వచ్చిందని కాకాణి న్యాయవాది చంద్రశేఖర్ తెలిపారు.
వాంగ్మూలాలతో తప్పుడు కేసులా?
వాంగ్మూలాలు ఏ పాటి విలువ ఉంటుందో మీకు తెలుసు. గిట్టని వాడు చేసే ఆరోపణలు, ఇచ్చే వాంగ్మూలాలు పక్కన పెట్టి నేను పదే పదే కోరినట్లు ఈ కేసులో నా పాత్ర ఉన్నట్లు మీరు నిర్ధారించి, ఆధారాలు చూపిస్తే నేరుగా న్యాయమూర్తి దగ్గర తప్పు ఒప్పుకొని న్యాయస్థానం విధించే శిక్షను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కూటమి ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చింది. వాటిని అమలు చేయకుండా మోసగించడంతో మోస పూరిత పోకడలను నేను పదే పదే ప్రశ్నించడంతో వాస్తవాలు ప్రజలకు తెలిసి పోతున్నాయని మా నోళ్లు మూయించేందుకు అక్రమ కేసు బనాయించి నిర్బంఽధించాలన్న కుట్రలో భాగమే ఈ అక్రమ కేసు తప్ప మరొకటి కాదు. నేను 2014, 2019 ఎన్నికల్లో సర్వేపల్లి ఎమ్మెల్యేగా విజయం సాధించాను. జిల్లా పరిషత్ చైర్మన్‌గా, మంత్రిగా పనిచేశా. ఎన్నడూ చట్ట విరుద్ధమైన కార్యకలాపాలు సాగించడం, అక్రమ మార్గాలు అనుసరించడం ఎన్నడూ చేయలేదు. మీరు నిందితులను ముఖాముఖి తీసుకుని వస్తే అసలు ఫిర్యాదుదారు నాకు పరిచయం ఉన్నాడా? లేదా? అనే విషయం స్పష్టమవుతుంది. అవన్నీ వదిలేసి అడ్డదారులెందుకని ఎకై ్సజ్ అధికారుల పరంపరలో కాకాణి చెప్పినట్లు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు.
మంత్రిగా అధికారులతో
అత్యంత గౌరవం ప్రదర్శించాను
కూటమి ప్రభుత్వ వైఫల్యాలను
ప్రశ్నించినందుకే అక్రమ కేసులు
మీరు ఒక్క ఆధారమూ చూపించలేదు
రెండో రోజూ ఎకై ్సజ్ అధికారులు
విచారణలో మాజీమంత్రి కాకాణి