
సెప్టెంబర్ 9న జాతీయ లోక్ అదాలత్
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్
నెల్లూరు (లీగల్): సెప్టెంబర్ 9న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌లో అత్యధిక కేసులు పరిష్కరించడంలో అధికార యంత్రాంగం చర్యలు తీసుకుని సహకరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవ అధికార సంస్థ చైర్మన్ శ్రీనివాస్ కోరారు. జాతీయ లోక్ అదాలత్‌లో కేసుల పరిష్కారం కోసం వివిధ శాఖల అధికారులతో మంగళవారం జిల్లా కోర్టులోని జడ్జి చాంబర్‌లో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి కే వాణి అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జి తేజోవతి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వైఓ నందన్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీధర్‌రెడ్డి, రవాణాశాఖాధికారి మొహమ్మద్, కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ సీఈఓ శ్రీనివాసరావు, ఎకై ్స జ్ శాఖ, ఫైర్ సర్వీస్, ఎలక్ట్రిసిటీ ఈఈ, ఆర్టీసీ, ఇన్స్యూరెన్స్, చిట్ ఫండ్స్ సంస్థల అధికారులు, పలు కోర్టుల న్యాయమూర్తులు, నెల్లూరు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జల్లి పద్మాకర్ తదితరులు పాల్గొన్నారు.