
‘పచ్చ’ పైత్యం
● మినరల్ వాటర్ ప్లాంట్‌కు పసుపు రంగు
కొండాపురం (ఉదయగిరి): కొండాపురం మండలం మన్నంవారిపల్లిలో అధికార పార్టీ నేతలు పచ్చపైత్యాన్ని ప్రదర్శించారు. గ్రామంలో 2011–12 ఆర్థిక సంవత్సరంలో అప్పటి ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తన ఎంపీ గ్రాంట్ ద్వారా రూ.5 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను నిర్మించారు. ఈ నిధులతో గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్లాంట్‌ను నిర్మించింది. అప్పటి ప్రజాప్రతినిధులు ప్లాంట్ ప్రారంభించి గ్రామ పంచాయతీకి అప్పగించారు. అయితే గ్రామానికి చెందిన కొంతమంది అధికార పార్టీ కార్యకర్తలు అఽధికారులు, పంచాయతీ అనుమతి లేకుండా ప్లాంట్‌కు పసుపు రంగు వేసి తమ పచ్చ పైత్యాన్ని చాటుకున్నారు. ఎంపీ గ్రాంట్‌తో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్‌కు టీడీపీ పసుపు రంగు వేయడంపై గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ వివాదాలకు దారితీసే ఈ చర్యపై సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

‘పచ్చ’ పైత్యం