చెన్నై సూపర్ కింగ్స్‌కు సంజూ శాంసన్ వెళ్లడం ఖరారైనప్పుడు.. ఇకపై రాజస్థాన్ రాయల్స్ బాధ్యతలు యశస్వి జైస్వాల్ చేపడతాడని చాలా మంది భావించారు. లేదంటే జట్టులో ప్రధాన ఆటగాడిగా వ్యవహరిస్తాడని అనుకున్నారు. అయితే, కొన్ని నెలల తర్వాత పరిస్థితి మారింది. ఏడాది క్రితమే ఐపీఎల్‌లోకి ప్రవేశించిన టీనేజర్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు జట్టులో ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్రపంచ క్రికెట్‌లోని కీలక ఆటగాళ్లను సైతం డామినేట్ చేస్తున్నాడు.
మరోవైపు, 2023 ఐపీఎల్ సీజన్‌లో 600కుపైగా పరుగులు, 48.07 సగటుతో రాణించినప్పటి నుంచి యశస్వి జైస్వాల్‌ను భారత క్రికెట్ ఫ్యూచర్ స్టార్‌గా భావించారు. కానీ, 2026 మే నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ దాదాపు ప్రతి అంశంలోనూ అతడిని మించిపోయాడు.
వైభవ్ సూర్యవంశీ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుండగా ఇప్పుడు యశస్వి జైస్వాల్ కెరీర్‌లో కీలక నిర్ణయం తీసుకునే దశలో నిలిచాడు. ఆటను మరింత మెరుగుపర్చుకుని రాజస్థాన్ జట్టులోనే ఉండడం. లేదంటే జట్టు మారడం. జైస్వాల్ తన ఆట తీరును మరింత మెరుగుపరచుకోకపోతే వైభవ్ సూర్యవంశీ ఎదుగుదల ముందు అతడి పేరు, గుర్తింపు, ప్రాధాన్యం తగ్గిపోయే అవకాశం ఉంది.
మాజీ భారత క్రికెటర్ అంబటి రాయుడు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వైభవ్ సూర్యవంశీ నీడ నుంచి బయటకు వచ్చి(ఆర్‌ఆర్ నుంచి), మరో జట్టులో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని జైస్వాల్‌కు సూచించాడు.
“అతడు తన ఆటతీరును మార్చుకోవాలి. ఎందుకంటే సూర్యవంశీతో కలిసి ఆడుతూ ప్రతిసారీ అతడి పర్ఫార్మన్స్ ముందు మసకబారిపోతూ ఉండలేడు. జైస్వాల్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న ఆటగాడు. మరో జట్టుకు వెళ్తే తన సొంత ప్రతిభతో మ్యాచ్‌లు గెలిపిస్తాడు. అతడికో ఓ వేదిక అవసరం. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ ఇకముందూ ఇతరుల ప్రభ తగ్గిపోయేలా చేస్తూనే ఉంటాడు” అని అంబటి రాయుడు అన్నాడు.
“వైభవ్ సూర్యవంశీతో పాటు ఓ సీనియర్ భాగస్వామి ఉండాలి. పరిస్థితిని అర్థం చేసుకునే వ్యక్తి కావాలి. అతడి విజయాన్ని చూసి ఆనందించాలి. పోటీగా భావించకూడదు. అతడితో పోటీ పడటం సాధ్యం కాదు” అని తెలిపాడు. జైస్వాల్‌కు ముంబై ఇండియన్స్ సరైన జట్టని అన్నాడు.


