గోవాతో నాకెన్నో జ్ఞాపకాలు: వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌ | World champion Gukesh looks forward to be in Goa for the FIDE World Cup 2025 | Sakshi
Sakshi News home page

గోవాతో నాకెన్నో జ్ఞాపకాలు: వరల్డ్‌ చాంపియన్‌ గుకేశ్‌

Oct 27 2025 6:26 PM | Updated on Oct 27 2025 7:36 PM

World champion Gukesh looks forward to be in Goa for the FIDE World Cup 2025

ఫిడే ప్రపంచకప్‌-2025 (FIDE World Cup 2025) టోర్నమెంట్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. దాదాపు 23 ఏళ్ల తర్వాత తొలిసారి ఈ మెగా చెస్‌ ఈవెంట్‌కు వేదిక కాగా.. గోవాలో అక్టోబరు 31- నవంబరు 27 వరకు టోర్నీ నిర్వహణకు షెడ్యూల్‌ ఖరారైంది. ఉత్తర గోవాలోని ఓ రిసార్టులో టోర్నీ నిర్వహించనున్నారు.

మొత్తంగా 82 దేశాల నుంచి 206 మంది చెస్‌ క్రీడాకారులు ప్రపంచకప్‌ టోర్నీలో పాల్గొనబోతున్నారు. నాకౌట్‌ ఫార్మాట్లో నిర్వహించే ఈ ఈవెంట్లో టాప్‌-3లో నిలిచిన వాళ్లు 2026 క్యాండిడేట్స్‌ ఈవెంట్‌కు అర్హత సాధించారు. విజేతకు ప్రైజ్‌మనీ 20,00,000 డాలర్లు.

గోవాతో నాకెన్నో జ్ఞాపకాలు
ఈ నేపథ్యంలో వరల్డ్‌ చాంపియన్‌ దొమ్మరాజు గుకేశ్‌ (D Gukesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘వరల్డ్‌కప్‌ టోర్నీ కోసం ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నా. స్వదేశంలో ఎక్కడ ఆడినా ఈ టోర్నీ ప్రత్యేకంగా మిగిలిపోతుంది.

ముఖ్యంగా గోవాతో నాకెన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ నేను కొన్ని జూనియర్‌ లెవల్‌ ఈవెంట్లలో ఆడాను’’ అంటూ ఈ టాప్‌ సీడ్‌ హర్షం వ్యక్తం చేశాడు. కాగా గుకేశ్‌ 2019లో గోవా వేదికగా ఇంటర్నేషనల్‌ ఓపెన్‌ గ్రాండ్‌మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్లో పాల్గొన్నాడు. నాడు కేటగిరీ- ‘ఎ’ నుంచి పోటీపడిన గుకేశ్‌​ పదో స్థానంతో ముగించాడు.

ఫేవరెట్‌గా అనిశ్‌ గిరి కూడా..
అయితే, ఈసారి ఏకంగా డిఫెండింగ్‌ చాంపియన్‌ హోదాలో గుకేశ్‌ బరిలోకి దిగనుండటం విశేషం. ఇక గుకేశ్‌తో పాటు.. నేపాల్‌ సంతతికి చెందిన డచ్‌ గ్రాండ్‌మాస్టర్‌ అనిశ్‌ గిరినీ టోర్నీలో ఫేవరెట్‌గా పోటీలో నిలిచాడు. ఇప్పటికే అతడు ఫిడే గ్రాండ్‌ స్విస్‌ టోర్నమెంట్‌-2025కి అర్హత సాధించాడు. 

కాగా 2005 నుంచి నాకౌట్‌ ఫార్మాట్లో నిర్వహిస్తున్న ఫిడే వరల్డ్‌కప్‌ టోర్నీలో భారత చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌తో పాటు అర్మేనియాకు చెందిన లెవాన్‌ ఆరోనియన్‌ మాత్రమే రెండుసార్లు టైటిల్‌ గెలవగలిగారు.

చదవండి: Shreyas Iyer: పరిస్థితి సీరియస్‌?.. సిడ్నీకి పయనమైన తల్లిదండ్రులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement