
టెస్టు మ్యాచ్‌లో ప్రతీ రోజు ఆటలో లంచ్ విరామంతో పాటు టీ బ్రేక్ ఉంటాయి. అయితే లంచ్ బ్రేక్‌లో ఆటగాళ్లు ఏమి తింటారా అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిచూపుతుంటారు. తాజాగా ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ ఓలీ పోప్ లంచ్ బ్రేక్‌లో తాను ఏమి తీసుకుంటాడో వెల్లడించాడు.
"సాధారణంగా లంచ్ మెనూలో చికెన్, చేపలు, పాస్తాతో పలు రకాల వంటకాలు ఉంటాయి. ఆటగాళ్లు తమకు ఎక్కువగా ఎనర్జీ ఇచ్చే ఆహారాన్ని తీసకుంటారు. నా విషయానికొస్తే.. నేను బ్యాటింగ్‌లో ఉంటే ఎక్కువగా ఫుడ్ తీసుకోను. ఆ సమయంలో ఎందుకో నాకు ఎక్కువగా తినాలనిపించదు.
కాబట్టి నేను ప్రోటీన్ షేక్, అరటిపళ్లు ఎక్కవగా తింటాను. అదే రోజు మొత్తం బ్యాటింగ్ చేస్తే కనీసం ఆరటిపళ్లు కూడా తినను. ఎందుకంటే ఎక్కువ తిని బ్యాటింగ్ కొనసాగించడం చాలా కష్టం. ఆ రోజు ఆట ముగిశాక ఫుడ్ తీసుకుంటాను. అదేవిధంగా సెకెండ్ బ్రేక్ సమయంలో కొంతమంది ఆటగాళ్లు టీ తీసుకోవడానికి ఇష్టపడతారు.
నేను అయితే నేను సాధారణంగా కాఫీ తాగుతాను. కొన్నిసార్లు, వర్షం ఆలస్యం అయినప్పుడు ఒక కప్పు టీ తాగుతాను అని" స్కై స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పోప్ పేర్కొన్నాడు. కాగా కాగా లార్డ్స్‌లో లంచ్ మెనూకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టింది. అందులో బటర్నట్ స్క్వాష్ సూప్,సీబాస్ ఫిల్లెట్, బాస్మతి రైస్, రొయ్యల కర్రీ వంటి వంటకాలు ఉన్నాయి.
ఇక భారత్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో ఈ ఇంగ్లండ్ వైస్ కెప్టెన్ పర్వాలేదన్పిస్తున్నాడు. తొలి టెస్టులో పోప్ అద్బుతమైన సెంచరీతో చెలరేగి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా లార్డ్స్ టెస్టులో కూడా 44 పరుగులతో రాణించాడు.
చదవండి: T20 Blast: చరిత్ర సృష్టించిన 17 ఏళ్ల కుర్రాడు.. హ్యాట్రిక్ వికెట్లతో రికార్డు! వీడియో