
అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా స్టార్ బ్యాటర్, రన్ మిషన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కు పైగా పరుగులు అత్యధిక సార్లు చేసిన ఆటగాడిగా విరాట్ రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా శ్రీలంకపై 34 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద కోహ్లి.. ఈ ఘనతను అందుకున్నాడు.
కోహ్లి ఇప్పటివరకు 8 సార్లు ఒక క్యాలెండర్ ఇయర్‌లో 1000కుపైగా పరుగులు సాధించాడు. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ తన వన్డే కెరీర్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో 7 సార్లు 1000కు పైగా పరుగులు నమోదు చేశాడు. తాజా మ్యాచ్‌తో మాస్టర్ బ్లాస్టర్ ఆల్‌టైమ్ రికార్డును కింగ్ కోహ్లి బ్రేక్ చేశాడు.
ఓవరాల్‌గా ఇప్పటివరకు 288 వన్డేలు ఆడిన విరాట్.. 58.19 సగటుతో 13499 పరుగులు సాధించాడు. అతడి వన్డే కెరీర్‌లో 48 సెంచరీలు, 70 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కోహ్లి మరో సెంచరీ చేస్తే..వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్(49) రికార్డును సమం చేస్తాడు.
చదవండి: SMAT 2023: రింకూ సింగ్ విధ్వంసం.. 33 బంతుల్లో 6 సిక్సర్ల సాయంతో..!