Theunis De Bruyn Retirement: 30 ఏళ్లకే కెరీర్‌ ముగించిన సౌతాఫ్రికా క్రికెటర్‌

Theunis De Bruyn Announces International Retirement - Sakshi

Theunis De Bruyn: సౌతాఫ్రికా క్రికెటర్‌ థియునిస్‌ డి బ్రూన్‌ 30 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఆరేళ్ల ‍కెరీర్‌లో కేవలం 13 టెస్ట్‌లు, 2 టీ20లు మాత్రమే ఆడిన డి బ్రూన్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలని కఠిన నిర్ణయం తీసుకున్నాడు. గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాపై తన చివరి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడిన డి బ్రూన్‌.. ఆ తర్వాత సరైన అవకాశాలు రాక జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు.

టెస్ట్‌ల్లో 19.5 సగటున 468 పరుగులు చేసిన డి బ్రూన్‌ .. 2018లో శ్రీలంకపై సెంచరీ చేశాడు. ఇదే అతని కెరీర్‌లో ఏకైక సెంచరీ. ఇది మినహా డి బ్రూన్‌ కెరీర్‌లో కనీసం అర్ధసెంచరీ కూడా లేదు. టీ20ల్లో కేవలం 2 మ్యాచ్‌లు ఆడిన డి బ్రూన్‌.. కేవలం 26 పరుగులు మాత్రమే సాధించాడు. డి బ్రూన్‌ రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని అతని దేశవాలీ టీమ్‌ టైటాన్స్‌ వెల్లడించింది.

జాతీయ జట్టుకు ప్రాతనిధ్యం వహించడాన్ని డి బ్రూన్‌ గౌరవంగా ఫీలవుతున్నాడని టైటాన్స్‌ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. డి బ్రూన్‌ తన ఆరాధ్య క్రికెటర్లతో డ్రెస్సింగ్‌ షేర్‌ చేసుకోవడం పట్ల చాలా గర్వంగా ఫీలవుతున్నట్లు పేర్కొంది.

కాగా, డి బ్రూన్‌ ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్‌ తొలి ఎడిషన్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఈ లీగ్‌లో క్యాపిటల్స్‌ రన్నరప్‌గా నిలిచింది. SA20 ఇనాగురల్‌ లీగ్‌లో 238 పరుగులు చేసిన డి బ్రూన్‌.. ఎడిషన్‌ సెకెండ్‌ హైయెస్ట్‌ రన్‌ స్కోరర్‌గా నిలిచాడు.   
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top