పాకిస్తాన్‌-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు ఉగ్రముప్పు | Terror Threat Forces Pakistan To Take Never Seen Before Step For Australia Series | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌-ఆస్ట్రేలియా వన్డే సిరీస్‌కు ఉగ్రముప్పు

May 25 2026 3:42 PM | Updated on May 26 2026 1:31 PM

Terror Threat Forces Pakistan To Take Never Seen Before Step For Australia Series

ఈ నెల 30వ తేదీ నుంచి పాకిస్తాన్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ఉగ్రముప్పు పొంచి ఉంది. ఈ నేపథ్యంలో పాక్‌ ప్రభుత్వం ఇప్పటివరకు ఎప్పుడూ చూడని స్థాయిలో భద్రతా చర్యలు చేపట్టింది. ముఖ్యంగా మే 30న రావల్పిండి క్రికెట్‌ స్టేడియంలో జరగనున్న తొలి వన్డే కోసం భారీ ఎత్తున పోలీసు బలగాలను మోహరించింది.

ఈసారి ప్రత్యేకత ఏమిటంటే.. కేవలం ఆస్ట్రేలియా జట్టుకే కాదు, భద్రత కల్పిస్తున్న పోలీసు సిబ్బందికి సైతం రక్షణ కల్పించేందుకు ప్రత్యేక "సెక్యూరిటీ అండ్‌ డిసిప్లిన్‌ యూనిట్‌"ను ఏర్పాటు చేశారు. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్‌ అధికారులు వెల్లడించారు.

కాగా, రావల్పిండి, లాహోర్‌ వేదికలుగా మే 30, జూన్‌ 2, 4 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. ఈ మూడు మ్యాచ్‌లు భారతకాలమానం ప్రకారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభమవుతాయి. ఈ సిరీస్‌ కోసం ఇరు జట్లను ఇదివరకే ప్రకటించారు. ఐపీఎల్‌ కారణంగా చాలామంది ఆసీస్‌ ఆటగాళ్లు ఈ సిరీస్‌కు అందుబాటులో లేరు.

జట్ల వివరాలు..
పాకిస్తాన్‌: అబ్దుల్‌ సమద్‌, బాబర్‌ ఆజం, సాహిబ్‌జాదా ఫర్హాన్‌, షమిల్‌ హుసేన్‌, సల్మాన్‌ అఘా, మాజ్‌ సదాకత్‌, షాదాబ్‌ ఖాన్‌, ఘాజీ ఘోరీ, రోహైల్‌ నజీర్‌, షాహీన్‌ అఫ్రిది (కెప్టెన్‌), అబ్రార్‌ అహ్మద్‌, అహ్మద్‌ దనియాల్‌, అరాఫత్‌ మిన్హాస్‌, హరీస్‌ రౌఫ్‌, నసీం షా, సూఫియాన్‌ ముఖీమ్‌

ఆస్ట్రేలియా: మార్నస్‌ లబూషేన్‌, మాథ్యూ షార్ట్‌, మ్యాట్‌ రెన్షా, మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), కెమరూన్‌ గ్రీన్‌, లియామ్‌ స్కాట్‌, ఒలివర్‌ పీక్‌, అలెక్స్‌ క్యారీ, జోష్‌ ఇంగ్లిస్‌, రిలే మెరిడిత్‌, తన్వీర్‌ సంఘా, నాథన్‌ ఇల్లిస్‌, మాథ్యూ కుహ్నేమన్‌, బిల్లీ స్టాన్‌లేక్‌, ఆడమ్‌ జంపా

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement