T20 World Cup: అతడితో కలిసి ఓపెనింగ్‌ చేయడం ఖాయం: పాక్‌ కెప్టెన్‌

T20 World Cup: Babar Azam Defends His Decision Open Innings With Rizwan - Sakshi

Babar Azam Commnets On T20 World Cup: టీ20 వరల్డ్‌కప్‌ నేపథ్యంలో తమ జట్టు ఓపెనింగ్‌ జోడి గురించి పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం కీలక వ్యాఖ్యలు చేశాడు. మహ్మద్‌ రిజ్వాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభిస్తానని స్పష్టం చేశాడు. ఈ విషయంలో తన నిర్ణయం సరైందేనని సమర్థించుకున్నాడు. ఈ మేరకు ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ టాపార్డర్‌లో తాను, అత్యుత్తమ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిజ్వాన్‌ బెస్ట్‌ ఓపెనింగ్‌ జోడి అని చెప్పుకొచ్చాడు. 

‘‘ఓపెనర్‌గా ఉన్న నేను... ప్రపంచంలోనే నంబర్‌ 1 ఆటగాడిగా ఎదిగాను. ఓపెనర్‌గా బరిలోకి దిగడం నాకెంతో సౌకర్యవంతంగా ఉంది. ఆ స్థానంలో ఆడితేనే నేను అత్యుత్తమ ప్రదర్శన కనబరచగలను. ఇక రిజ్వాన్‌... తను ఇప్పటికే.. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలి? మేమిద్దరం మంచి కాంబినేషన్‌. శుభారంభం అందించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటాం. పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటూ అవగాహనతో ఆడతాం.

మైదానంలో... ఒకవేళ నేను పరుగులు చేయడానికి ఇబ్బంది పడితే.. రిజ్వాన్‌ సలహాలు ఇస్తాడు. తను స్ట్రగుల్‌ అయితే.. నేను సూచనలు చేస్తాను. పెద్ద పెద్ద భాగస్వామ్యాలు నెలకొల్పితే మా తర్వాత వచ్చే బ్యాటింగ్‌కు వచ్చే వాళ్లకు పని సులువవుతుంది ’’ అని బాబర్‌ ఆజమ్‌ పేర్కొన్నాడు. ఒకటీ రెండు మ్యాచ్‌లలో తాను సరిగ్గా ఆడనంత మాత్రాన.. వెనకడుగు వేయాల్సిన అవసరం లేదన్నాడు. ఇక యూఏఈలో తమకు మంచి రికార్డు ఉందన్న బాబర్‌ ఆజం.. కచ్చితంగా మెగా టోర్నీలో మెరుగ్గా రాణిస్తామని విశ్వాసం వ్యక్తం చేశాడు. మిడిలార్డర్‌, డెత్‌ బౌలింగ్‌ విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా... వాటిని అధిగమించి సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతామని పేర్కొన్నాడు. 

టి20 ప్రపంచకప్‌ పాకిస్తాన్‌ 15మందితో కూడిన జట్టు
బాబర్ అజమ్ (కెప్టెన్), షాదాబ్ ఖాన్ (వైస్ కెప్టెన్), ఆసిఫ్ అలీ, ఫఖర్ జమాన్, హైదర్ అలీ, హారిస్ రౌఫ్, హసన్ అలీ, ఇమాద్ వసీం, మహ్మద్ హఫీజ్, మహ్మద్ నవాజ్, మహ్మద్ రిజ్వాన్, మొహమ్మద్ వసీం జూనియర్, సర్ఫరాజ్ అహ్మద్, షహీన్ షా అఫ్రిది, సోహైబ్ మక్సూద్

రిజర్వ్‌ ఆటగాళ్లు- కుష్‌దిల్‌ షా, షానవాజ్ దహాని, ఉస్మాన్ ఖాదిర్

చదవండి: IPL 2021: ఎలిమినేటర్‌ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ కీలక ప్రకటన

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top