Kane Williamson: కెప్టెన్‌గా హీరో.. కప్పు అందుకోవడంలో జీరో; ఈసారైనా

T20 WC 2022: Captaincy Fate NZ Captain Kane Williamson In World Cups - Sakshi

న్యూజిలాండ్‌కు బ్లాక్‌ క్యాప్స్‌ అనే ముద్ర ఉంది. ఈ ముద్ర వారికి ఊరికే రాలేదు. సైన్స్‌ను బలంగా నమ్మేవాళ్లకు ఇది వింత అనిపించొచ్చు. కానీ కివీస్‌ తమ జెర్సీ రంగు మార్చేవరకు ఐసీసీ ట్రోఫీలు కొట్టదనే అపవాదు గట్టిగా ప్రచారంలో ఉంది. ఇది ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ ఐసీసీ మేజర్‌ టోర్నీల్లో సౌతాఫ్రికా తర్వాత దురదృష్టవంతమైన జట్టుగా న్యూజిలాండ్‌కు పేరుంది. ప్రతీసారి అంచనాలకు మించి రాణించడం.. ఆఖరికి ఫైనల్‌ మెట్టుపై బోల్తా కొట్టడం వారికి మాత్రమే సాధ్యమైంది. 2015 వన్డే వరల్డ్‌కప్‌ నుంచి కివీస్‌ది ఇదే తంతు.

కివీస్‌ వరుసగా మూడు వరల్డ్‌కప్‌ ఫైనల్స్‌ ఆడడమంటే మాములు విషయం కాదు. 2015లో మెక్‌కల్లమ్‌ సారధ్యంలోని కివీస్‌ సేన ఆఖరి మెట్టుపై బోల్తా పడితే.. 2019 వన్డే వరల్డ్‌కప్‌, 2021 టి20 వరల్డ్‌కప్‌లో కేన్‌ విలియమ్సన్‌ నేతృత్వంలో బ్లాక్‌క్యాప్స్‌  రెండుసార్లు ఫైనల్‌కు చేరి కూడా ట్రోఫీ అందుకోలేకపోయింది. అయితే కేన్‌ విలియమ్సన్‌ నేతృత్వంలోనే న్యూజిలాండ్‌.. ఐసీసీ తొలిసారి ప్రవేశపెట్టిన టెస్టు చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఒక్కసారి కూడా కప్పు కొట్టలేపోయింది. 

ఇక 2022 టి20 ప్రపంచకప్‌లోనూ న్యూజిలాండ్‌ మరోసారి ఫేవరెట్‌గానే కనిపిస్తోంది. సూపర్‌-12 దశలో గ్రూప్‌-1లో ఒక్క మ్యాచ్‌ ఓడిపోని కివీస్‌ టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఇక సెమీస్‌లో నవంబర్‌ 9న(బుధవారం) పా​కిస్తాన్‌తో అమితుమీ తేల్చుకోనుంది. ఒకవేళ ఈసారి కూడా న్యూజిలాండ్‌ ఫైనల్లో అడుగుపెడితే.. కేన్‌ మామ సారధ్యంలో ఇది మూడోసారి.. వరుసగా నాలుగో మెగాటోర్నీ ఫైనల్‌ ఆడనుంది. 

కెప్టెన్‌గా హీరోగా నిలిచిన కేన్‌ విలియమ్సన్‌ ఐసీసీ ట్రోఫీ అందుకోవడంలో మాత్రం ప్రతీసారి జీరో అవుతున్నాడు. ఒకవేళ కివీస్‌ ఫైనల్‌ చేరితే.. ఈసారైనా కేన్‌ విలియమ్సన్‌ కల నెరువెరుతుందేమో చూడాలి. చూస్తుంటే ఈసారి మాత్రం కివీస్‌ జట్టు కప్‌ కొట్టేలానే కనిపిస్తుంది. పాకిస్తాన్‌ సెమీస్‌లో ఎప్పుడైనా ప్రమాదకారే. అయితే నిలకడలేమి పాకిస్తాన్‌కున్న బలహీనత. ఆ బలహీనతను క్యాష్‌ చేసుకొని న్యూజిలాండ్‌ ఫైనల్లో అడుగుపెడుతుందేమో చూడాలి. 

చదవండి: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌.. అడవి బాట పట్టిన టీమిండియా క్రికెటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top