
టీ20 బ్లాస్ట్ 2025లో హ్యాంప్‌షైర్ ఆటగాడు (ఆసీస్) క్రిస్ లిన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నీ ఫైనల్స్ డే (టీ20 బ్లాస్ట్‌లో సెమీస్, ఫైనల్స్ ఒకే రోజు జరుగుతాయి) చరిత్రలో శతకం బాదిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. నిన్న (సెప్టెంబర్ 13) నాటింగ్హమ్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్‌లో 50 బంతుల్లో శతకం పూర్తి చేసిన లిన్.. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు చేశాడు. తద్వారా తన జట్టును ఒంటిచేత్తో ఫైనల్స్‌కు చేర్చాడు. 159 పరుగుల లక్ష్య ఛేదనలో లిన్ ఒక్కడే 90 శాతం పరుగులు చేశాడు. సెంచరీ పూర్తి చేసే క్రమంలో ఓ ఓవర్‌లో (లాయిడ్ పోప్) వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు.
లిన్ రికార్డు శతకంతో హ్యాంప్‌షైర్‌ను ఫైనల్స్‌కు చేర్చినా.. ఆ జట్టు తుది మెట్టుపై బోల్తా పడింది. తొలి సెమీఫైనల్ (ఇది కూడా నిన్ననే జరిగింది) విజేత సోమర్‌సెట్‌తో జరిగిన ఫైనల్లో హ్యాంప్‌షైర్ ఓటమిపాలైంది. సెమీస్‌లో విధ్వంసకర శతకంతో చెలరేగిన లిన్ ఫైనల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. 7 బంతుల్లో సిక్స్, ఫోర్ సాయంతో 12 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.
ఫైనల్లో లిన్ విఫలమైనా హ్యాంప్‌షైర్ భారీ స్కోరే (194/6) చేసింది. అయితే దాన్ని కాపాడుకోవడంలో విఫలమైంది. విల్ స్మీడ్ (58 బంతుల్లో 94; 14 ఫోర్లు, 14 ఫోర్లు, సిక్స్) విధ్వంసం సృష్టించి సోమర్‌సెట్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. సోమర్‌సెట్‌కు ఇది మూడో టీ20 బ్లాస్ట్ టైటిల్. ఫైనల్లో స్మీడ్ చేసిన పరుగులు (94) టోర్నీ ఫైనల్స్ ఛేదనల చరిత్రలో అత్యధికం.