Suresh Raina Dancing For Allu Arjun Pushpa Srivalli Song, Video Viral - Sakshi
Sakshi News home page

Suresh Raina: "పుష్ప" పాటకు చిందేసిన టీమిండియా మాజీ క్రికెటర్.. తగ్గేదేలే అంటూ..!

Jan 23 2022 4:55 PM | Updated on Jun 9 2022 6:17 PM

Suresh Raina Dance For Pushpa Srivalli Song - Sakshi

Suresh Raina Dance For Srivalli Song: పాన్‌ ఇండియా మూవీ "పుష్ప" మేనియా క్రికెట్‌ ప్రపంచాన్ని ఊపేస్తుంది. ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌, ప్రముఖ టీమిండియా క్రికెటర్లు శిఖర్‌ ధవన్‌, రవీంద్ర జడేజా, సూర్యకుమార్‌ యాదవ్‌, ఇషాన్‌ కిషన్‌లు తగ్గేదేలే అంటూ పుష్ప సినిమా పాటలు, డైలాగులతో ఇరగదీశారు. తాజాగా ఈ జాబితాలోకి టీమిండియా మాజీ క్రికెటర్ సురేష్ రైనా కూడా చేరాడు. పుష్ప సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ "చూపే బంగారమాయనే శ్రీవల్లి.." పాటకు స్టెప్పులేసి అదరహో అనిపించాడు. రైనాతో పాటు అతని కుటుంబ సభ్యులు కూడా బన్నీ సాంగ్‌కు చిందేశారు. 

దీనికి సంబంధించిన వీడియోను రైనా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ.. బన్నీపై ప్రశంసల వర్షం కురిపించాడు. పుష్ప సినిమాను చూశాన‌ని, అందులో అల్లు అర్జున్ న‌ట‌న అద్భుంతంగా ఉందని కొనియాడాడు. బన్నీ మన్ముందు మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని ఆకాంక్షిస్తూ.. త‌న ఇన్‌స్టా ఖాతాలో రాసుకొచ్చాడు. రైనా చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైర‌లవుతుంది. రైనా ఫ్యాన్స్‌తో పాటు బన్నీ అభిమానులు లైక్‌లు, కామెంట్లతో సోషల్‌మీడియాను హోరెత్తిస్తున్నారు.

కాగా,  రైనా 2020 ఆగస్ట్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రైనా భారత్ తరఫున 18 టెస్ట్‌లు, 226 వన్డేలు, 78 టీ20లు ఆడాడు. రైనా.. ఐపీఎల్‌ గత సీజన్ వరకు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కీలక ఆటగాడిగా కొనసాగాడు. అయితే ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు సీఎస్‌కే అతన్ని రీటైన్ చేసుకోలేదు. దీంతో అతను 2 కోట్ల బేస్‌ ధర విభాగంలో  వేలంలో పాల్గొననున్నాడు. 35 ఏళ్ల రైనా.. ఐపీఎల్‌లో 205 మ్యాచ్‌ల్లో 5528 పరుగులు చేశాడు.
చదవండి: ఇన్ని రోజులు కెప్టెన్‌గా ఉన్నావు కాబట్టి నడిచింది.. ఇకపై కుదరదు..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement