సురేశ్‌ జోడీ సంచలనం | Suresh Jodi Sensation | Sakshi
Sakshi News home page

సురేశ్‌ జోడీ సంచలనం

Aug 21 2024 4:50 AM | Updated on Aug 21 2024 4:50 AM

Suresh Jodi Sensation

నార్త్‌ కరోలినా: విన్‌స్టన్‌–సాలెమ్‌ ఓపెన్‌  ఏటీపీ–250 టోర్నీ డబుల్స్‌ విభాగంలో భారత టెన్నిస్‌ ప్లేయర్‌ దక్షిణేశ్వర్‌ సురేశ్‌ సంచలనం  సృష్టించి క్వార్టర్‌ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. తొలి  రౌండ్‌లో సురేశ్‌ (భారత్‌)–లుకా పౌ (బ్రిటన్‌) ద్వయం 6–4, 5–7, 10–8తో ఆరో సీడ్‌ బెహర్‌ (ఉరుగ్వే)–మొల్టెని (అర్జెంటీనా) జోడీని బోల్తా కొట్టించింది.

 77 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌ లో సురేశ్‌ జోడీ తొమ్మిది ఏస్‌లు సంధించింది. తమ సర్విస్‌ను ఒకసారి కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను ఒకసారి బ్రేక్‌ చేసింది. ‘సూపర్‌ టైబ్రేక్‌’లో సురేశ్‌–లుకా పౌ ద్వయం కీలకదశలో పాయింట్లు గెలిచిసంచలన విజయాన్ని ఖరారు చేసుకుంది.   

Advertisement
 
Advertisement
Advertisement