సూపర్ మేన్ స్మిత్‌.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌! వీడియో వైరల్‌ | Steve Smiths Outrageous One-Handed Blinder Breaks Internet | Sakshi
Sakshi News home page

SL vs AUS: సూపర్ మేన్ స్మిత్‌.. ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్‌! వీడియో వైరల్‌

Feb 8 2025 4:55 PM | Updated on Feb 8 2025 6:24 PM

Steve Smiths Outrageous One-Handed Blinder Breaks Internet

ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్ స్టీవ్ స్మిత్(Steve Smith) మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. త‌న కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో అద్బుత క్యాచ్‌ల‌ను అందుకున్న స్మిత్‌.. తాజాగా మ‌రోసారి త‌న సంచ‌లన ఫీల్డింగ్‌తో అంద‌రిని ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

గాలే వేదిక‌గా శ్రీలంకతో జ‌రుగుతున్న రెండో టెస్టులో స్మిత్ స్ట‌న్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. శ్రీలంక సెకెండ్ ఇన్నింగ్స్  40వ ఓవర్ వేసిన ఆసీస్ స్పిన్న‌ర్ మాథ్యూ కుహ్నెమాన్.. నాలుగో బంతిని దనుంజయ డిసిల్వాకు ఫుల్ డెలివరీగా సంధించాడు. ఆ బంతిని శ్రీలంక కెప్టెన్ డిఫెండ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ బంతి సిల్వా బ్యాట్ ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. 

ఈ క్రమంలో స్మిత్ తన కుడివైపునకి డైవ్ చేస్తూ సింగల్ హ్యాండ్‌తో సంచలన క్యాచ్‌ను అందుకున్నాడు. అది చూసిన డిసిల్వా బిత్తరపోయాడు. చేసేదేమి లేక డిసిల్వా(23) నిరాశతో మైదానాన్ని వీడాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

స్మిత్ సరికొత్త చ‌రిత్ర‌..
కాగా ఈ మ్యాచ్‌లో స్మిత్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టెస్టుల్లో అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న ఆస్ట్రేలియా ఆట‌గాడిగా రికీ పాంటింగ్ రికార్డును స్మిత్ బ్రేక్ చేశాడు. ఈ మ్యాచ్‌లో ప్ర‌బాత్ జైసూర్య‌ క్యాచ్‌ను అందుకున్న ఈ స్మిత్‌.. ఈ అరుదైన ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.

పాంటింగ్‌ 287 ఇన్నింగ్స్‌లలో 196 క్యాచ్‌లు అందుకోగా.. స్మిత్ ఇప్ప‌టివ‌ర‌కు 205 ఇన్నింగ్స్‌లలో 198 క్యాచ్‌ల‌ను తీసుకున్నాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో ఆసీస్ క్రికెట్ దిగ్గజం మార్క్ వా(181) ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా వరల్డ్ క్రికెట్‌లో ఈ ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా దిగ్గజం రాహుల్ ద్రవిడ్ ఉన్నాడు. 286 టెస్టు ఇన్నింగ్స్‌ల‌లో ద్రవిడ్.. 210 క్యాచ్‌ల‌ను తీసుకున్నాడు.

స్మిత్ 12 క్యాచ్‌ల‌ను అందుకుంటే రాహుల్ ద్ర‌విడ్ ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసే అవ‌కాశ‌ముంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ స్టాండింగ్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్‌​లోనూ సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్‌(131) సెంచరీతో మెరిశాడు. తద్వారా  ఆసియాలో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్‌గా స్మిత్‌ నిలిచాడు. రిక్కీ పాంటింగ్‌(Ricky Ponting)ను స్మిత్ అధిగమించాడు.
చదవండి: CT 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్‌కు భారీ షాక్‌..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement