అందుకే నేను వికెట్‌ కీపర్‌ అయ్యాను: రిషబ్ పంత్

Started wicketkeeping because my father was a wicketkeeper Says Rishabh Pant - Sakshi

టీమిండియా స్టార్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ రిషబ్ పంత్ వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టడానికి గల కారణాన్ని వెల్లడించాడు. తన తండ్రిని ఆదర్శంగా తీసుకుని వికెట్‌ కీపర్‌ అయినట్లు పంత్‌ తెలిపాడు. పంత్‌ గత కొన్నేళ్లుగా భారత జట్టులో కీలక సభ్యడిగా ఉన్నాడు. 2019 ప్రపంచ కప్‌ తర్వాత భారత మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకోవడంతో పంత్‌ వికెట్‌ కీపర్‌ బాధ్యతలు చేపట్టాడు. ఇక జూన్‌9న దక్షిణాఫ్రికాతో ప్రారంభం కానున్న టీ 20 సిరీస్‌కు భారత జట్టులో పంత్‌ భాగమై ఉన్నాడు. అంతే కాకుండా ఈ సిరీస్‌కు టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా పంత్‌ ఎంపికయ్యాడు.

"నేను వికెట్‌ కీపింగ్‌ బాగా చేస్తున్నానో లేదో నాకు తెలియదు. కానీ నేను ఆడే ప్రతీ మ్యాచ్‌లోనే 100 శాతం ఎఫెక్ట్‌ పెడతాను. నేను ఎప్పుడూ వికెట్ కీపర్-బ్యాటర్‌నే. మా నాన్న కూడా వికెట్‌ కీపర్‌ కావడంతో నేను చిన్నప్పుడు నుంచే వికెట్‌ కీపింగ్‌ చేయడం మొదలు పెట్టాను. మా నాన్నను ఆదర్శంగా తీసుకునే ఈ రోజు నేను వికెట్‌ కీపర్‌ అయ్యాను. ఏ క్రికెటరైనా వికెట్ కీపర్ కావాలంటే చాలా యాక్టివ్‌గా ఉండాలి. చివరి వరకు బంతిపై దృష్టి పెట్టి అందుకునే ప్రయత్నం చేయాలి" అని పంత్‌ ఎస్‌జీ పోడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంత్‌ పేర్కొన్నాడు.
చదవండి: ENG vs NZ: ఇం‍గ్లండ్‌తో రెండో టెస్టు.. న్యూజిలాండ్‌కు భారీ షాక్‌..!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top