వరల్డ్‌ నంబర్‌ వన్‌గా భారత ప్లేయర్‌ | Srishti Kiran Tops Global Under 13 Tennis Rankings After 5 ITF Titles | Sakshi
Sakshi News home page

వరల్డ్‌ నంబర్‌ వన్‌గా భారత ప్లేయర్‌

Jun 11 2026 2:44 PM | Updated on Jun 11 2026 3:04 PM

Srishti Kiran Tops Global Under 13 Tennis Rankings After 5 ITF Titles

అండర్‌-13 టెన్నిస్‌లో బెంగళూరుకు చెందిన 13 ఏళ్ల సృష్టి కిరణ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐదు వరుస ఐటీఎఫ్ (ITF) జూనియర్ టైటిళ్లు సాధించిన తర్వాత, ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ స్థానాన్ని దక్కించుకుంది. ఇదే క్రమంలో సృష్టి మరో ఘనత కూడా సాధించింది.

ఐటీఎఫ్ జూనియర్ ర్యాంకింగ్‌లో కెరీర్ బెస్ట్ అయిన 357వ స్థానానికి చేరుకుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా అండర్-13 విభాగంలో అత్యుత్తమ ర్యాంక్‌ కావడం విశేషం. సృష్టి కేవలం ఎనిమిది ర్యాంకింగ్ టోర్నమెంట్లలో మాత్రమే పాల్గొని ఈ స్థాయికి చేరుకోవడం మరో విశేషం​. 

సాధారణంగా ర్యాంకింగ్ కోసం గరిష్టంగా 10 టోర్నమెంట్లను పరిగణలోకి తీసుకుంటారు. కానీ సృష్టి ఎనిమిది ఈవెంట్లలోనే అద్భుతమైన పురోగతి సాధించి అత్యుత్తమ ర్యాంక్‌ సాధించింది.

సృష్టి వరుసగా ఐదు జూనియర్‌ ITF టైటిళ్లు సాధించడంతో పాటు గ్వాటిమాలాలో జరిగిన ITF వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్స్ J100 టోర్నమెంట్‌లో రన్నరప్‌గా నిలిచింది. ఈ టోర్నీలో రన్నరప్‌గా నిలవడం ద్వారా ఆమెకు అంతర్జాతీయ గుర్తింపు దక్కింది. 

చిన్న వయసులోనే సంచలన ప్రదర్శనలతో సత్తా చాటుతున్న సృష్టి, భారత మహిళల టెన్నిస్‌ భవిష్యత్తు ఆశాకిరణంలా మారింది. త్వరలో ఈ అమ్మాయి జూనియర్ గ్రాండ్ స్లామ్ పోటీల్లో పాల్గొనే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement