Sourav Ganguly: గంగూలీ కుమార్తెకు కరోనా పాజిటివ్‌.. మరో ముగ్గురికి కూడా

Sourav Ganguly Daughter Sana And 3 Family Members Test Covid Positive - Sakshi

Sourav Ganguly Daughter Sana: భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధ్యక్షుడు, టీమిండియా మాజీ సారథి సౌరవ్‌ గంగూలీ కుటుంబాన్ని కరోనా వదలడం లేదు. ఇప్పటికే కోవిడ్‌(డెల్టాప్లస్‌ వేరియంట్‌)తో ఆస్పత్రిలో చేరిన గంగూలీ ఇటీవలే డిశ్చార్జ్‌ అయిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆయన కుమార్తె సనా గంగూలీ కరోనా బారిన పడినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.  

అదే విధంగా సనాతో పాటు గంగూలీ కుటుంబంలోని మరో ముగ్గురు సభ్యులకు కూడా కోవిడ్‌ సోకినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో గంగూలీకి మరోసారి కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించగా నెగటివ్‌గా తేలింది. కాగా లండన్‌లో చదువుకుంటున్న సనా గంగూలీ శీతాకాల సెలవుల్లో భాగంగా ఇటీవలే కోల్‌కతాకు వచ్చింది. ఇక దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,097 కోవిడ్‌ పాజిటివ్‌ నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొంది.

చదవండి: KL Rahul Vs Dean Elgar: డసెన్‌ తరహాలోనే కేఎల్‌ రాహుల్‌ అవుటైన తీరుపై వివాదం.. కెప్టెన్ల మధ్య వాగ్వాదం.. వైరల్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top