మ్యాచ్‌ హీరో అతడే.. ప్రత్యర్థి కెప్టెన్‌పై ప్రశంసలు | Shreyas Iyer Match Winning Comments After Punjab Beat Gujarat Titans | Sakshi
Sakshi News home page

IPL 2026: మ్యాచ్‌ హీరో అతడే.. ప్రత్యర్థి కెప్టెన్‌పై ప్రశంసలు

Apr 1 2026 10:40 AM | Updated on Apr 1 2026 11:08 AM

Shreyas Iyer Match Winning Comments After Punjab Beat Gujarat Titans

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. మంగ‌ళ‌వారం గుజ‌రాత్ టైటాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ 3 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో మ్యాచ్ ముగిసిన అనంత‌రం పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స్పందించాడు. మ్యాచ్‌ హీరో కచ్చితంగా కూపర్‌ కనోలీనేనని, అతడి వల్లే ఈ  గెలుపు సాధ్యమైందన్నాడు. అయితే గుజరాత్‌ కెప్టెన్‌ గిల్‌పై శ్రేయస్‌ ప్రశంసలు కురిపించడం ఆసక్తిగా మారింది. 

శ్రేయ‌స్ మాట్లాడుతూ..‘నా చేతికి స్పల్ప గాయమైంది. పెద్దది అవ్వొద్దని గట్టిగా కోరుకున్నా. ప్రస్తుతం అంతా బాగుంది. గాయం తీవ్రత కూడా పెద్దగా లేదు. అయితే ఈ మ్యాచ్‌లో హీరో మాత్రం కూపర్ కనోలీనే. అద్భుతమైన టెక్నిక్‌తో మ్యాచ్ ఆడాడు. కనోలీ బాదిన కొన్ని షాట్లు మాత్రం అద్భుతం. 

డ్రెస్సింగ్ రూమ్‌కి వెళ్లి చేతి గాయానికి ఐస్ పెట్టుకునే లోపే టపాటపా వికెట్లు పడిపోయాయి. క్రికెట్‌లో ఇలాంటి పరిస్థితులు సహజం. ఏం జరిగినా పోరాటం ఆపొద్దు. కనోలీ అదే చేశాడు. ప్రశాంతంగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించాడు. అర్ష్‌దీప్ సింగ్ వచ్చి బంతి కాస్త ఆగి వస్తోందని చెప్పాడు. అందుకే మేం బంతిని వీలైనంత త్వరగా పాతబడేలా చేయడానికి ప్రయత్నించాం. 

విజయ్ కుమార్ వైశాఖ్ గత సీజన్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అతడు బిగ్ మ్యాచ్ ప్లేయర్. అయితే నేను బ్యాటింగ్ చేసే సమయంలో షార్ట్ లెగ్ ఫీల్డర్‌ను చూసి షాకయ్యాను. ఇంతకుముందు ఏ కెప్టెన్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం నేను చూడలేదు. ఈ విషయాన్ని గిల్‌తో కూడా చెప్పాను. శుభ్‌మన్ గిల్ ఇలాంటి అటాకింగ్ ఫీల్డింగ్ సెట్ చేయడం బాగుంది’ అని అయ్యర్‌ చెప్పుకొచ్చాడు.

చదవండి: ఇట‌లీకి షాక్‌.. ఫిపా ప్ర‌పంచ‌క‌ప్‌కు అన‌ర్హ‌త‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement