'ఐపీఎల్‌ నా దూకుడును మరింత పెంచనుంది'

Sheldon Cottrell Says Aggression Brings Best Out Of Me - Sakshi

దుబాయ్‌ : షెల్డాన్‌ కాట్రెల్‌... ఈ వెస్టిండీస్‌ పేసర్‌ గురించి మాట్లాడితే ముందుగా అతని చేసే సెల్యూటే గుర్తుకు వస్తుంది. వికెట్‌ తీసిన ఎక్కువ సందర్భాల్లో కాట్రెల్‌ సెల్యూట్‌ చేస్తూ సెలబ్రేట్‌ చేసుకుంటాడు. 2019 ప్రపంచకప్‌ సందర్భంగా విండీస్‌ తరపున 12 వికెట్లు పడగొట్టిన కాట్రెల్‌ .. ఆ జట్టులోనే ఉన్న కీమర్‌ రోచ్‌, జేసన్‌ హోల్డర్‌, ఓషోన్‌ థామస్‌లను మించి యువ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు.ముఖ్యంగా భారత్‌లో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో కాట్రెల్‌ టీమిండియా ఆటగాడి వికెట్‌ తీసిన ప్రతీసారి సెల్యూట్‌ చేస్తూ భారత అభిమానుల ఆకట్టుకున్నాడు.

అందుకేనేమో గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఐపీఎల్‌ వేలంలో రూ. 8.50 కోట్లకు కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ కొనుగోలు చేసి కాట్రెల్‌కు ఘనంగా సెల్యూట్‌ చేసింది. సాధారణంగానే విండీస్‌ బౌలర్లు ఏ చిన్న ఆనందాన్నైనా తమ హావభావాలతో అభిమానులను కొల్లగొడుతుంటారు. డ్వేన్‌ బ్రోవో, డారెన్‌ సామి ఈ కోవకు చెందినవారే. గతంలో ఐపీఎల్‌లో వీరు చేసిన హంగామా మూములుగా ఉండేది కాదు. ఇక ఇప్పుడు కాట్రెల్‌ వంతు వచ్చింది.. ఇప్పటివరకు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌కు మాత్రమే ఆడిన కాట్రెల్‌ కింగ్స్‌ తరపున ఐపీఎల్‌లో ఎంత ఎంజాయ్‌మెంట్‌ ఇవ్వనున్నాడో చూడాలి. తాజాగా  నిర్వహించిన ఇంటర్య్వూలో 31 ఏళ్ల షెల్డన్‌ కాట్రెల్‌ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. (చదవండి : ఆర్‌సీబీలో కోహ్లి, డివిలియర్స్‌ ఫేవరెట్‌ కాదు')

ఇదే మీకు మొదటి ఐపీఎల్‌.. మరి దీన్ని ఎలా ఆస్వాధిస్తారు ?
ఐపీఎల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తోన్న.. క్రికెట్‌ చరిత్రలోనే అత్యధిక ప్రజాధరణ పొందిన ఐపీఎల్‌లో పాల్గొనబోతున్నందుకు సంతోషంగా ఉన్నా. కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీ ఆధ్వర్యంలో మహ్మద్‌ షమీ, క్రిస్‌ జోర్డాన్‌తో కలిసి బౌలింగ్‌ పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నా. కరీబియన్‌ లీగ్‌కు.. ఐపీఎల్‌కు చాలా తేడా ఉంటుంది. దీనికి అభిమానులు ఎక్కువగా ఉంటారు.. మనమేంటనేది నిరూపించుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంది. అని తెలిపాడు.

కింగ్స్‌ జట్టులోనే ఉన్న గేల్‌, నికోలస్‌తో మీ అనుబంధం ఎలా ఉంటుంది.. వారి నుంచి ఏమైనా సలహాలు పొందారా?
నా సహచరులైన క్రిస్‌ గేల్‌, నికోలస్‌ పూరన్‌లు కింగ్స్‌లో ఉండడం కొంచెం ధైర్యమే అని చెప్పొచ్చు. అయితే గేల్‌తో ఎక్కువగా మాట్లాడే అవకాశం రాలేదుగానీ.. అతను చాలా కూల్‌గా ఉంటాడు. వీలైనప్పుడు గేల్‌తో మాట్లాడే ప్రయత్నం చేస్తా. నికోలస్‌ పూరన్‌తో మాత్రం పలు క్రికెట్‌ అంశాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడుకుంటాం. 

ఈసారి ఐపీఎల్‌లో లెఫ్టార్మ్‌ స్పిన్‌ బౌలర్లు ఎక్కువగా లేకపోవడం మీకు కలిసి వస్తుందనుకుంటున్నారా?
ఆ విషయం గురించి నేను చెప్పలేను.. ఎందుకంటే క్రికెట్‌లో అలాంటి మాటలకు తావు ఉండదు. ఆటలో వివిధ రకాల బౌలర్లు ఉంటారు. ఆరోజు ఎవరు రాణించారు అనే దానిపైనే మ్యాచ్‌ ఆధారపడి ఉంటుంది. ఒక బ్యాట్స్ మాన్ సాధారణంగా తన కెరీర్లో 80-85 శాతం కుడిచేతి వాటం బౌలర్‌నే ఎదుర్కొంటాడు. ఎడమచేతి వాటం కారణంగా బ్యాట్స్‌మెన్‌కు నా బౌలింగ్‌ ఇబ్బందిగానే ఉంటుందని అనుకుంటున్నా. 

టీ20లో విజయవంతమైన బౌలర్‌గా పేరున్న క్రిస్‌ జోర్డాన్‌ వల్ల మీకు అవకాశాలు వస్తాయనుకుంటున్నారా?
అలాంటిదేం లేదు. క్రిస్‌ జోర్డాన్‌ అద్భుతమైన బౌలర్‌.. అలాగే మహ్మద్‌ షమీ కూడా గొప్ప ఆటగాడే.. కానీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం గురించే ఆలోచిస్తున్నా. ఇక జట్టులో అవకాశం వస్తుందా అనేది నా చేతుల్లో ఉండదు.ఒకవేళ అవకాశం వస్తే మాత్రం 120 శాతం కష్టపడతా.

ఐపీఎల్‌లో మీ సెల్యూట్స్‌ చూసే అవకాశం ఉంటుందా?
నేను ఫేమస్‌ అయ్యందే సెల్యూట్‌ ద్వారా.. ఈ ఐపీఎల్‌లో కూడా నా సెల్యూట్స్‌ ఉంటాయి. అభిమానులను ఎంటర్‌టైన్‌ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నా. అయితే సెల్యూట్‌ అనేది మాకు వంశపారపర్యంగా వస్తుంది. దీనిని వదులుకోనూ. అంతేగాక క్రికెట్‌ అంటే సీరియస్‌నెస్‌తో పాటు ఎంటర్‌టైన్‌మెంట్‌ కూడా ఉంటుంది. మీకు తప్పనిసరిగా నా సెల్యూట్‌ చూసే అవకాశం ఉంటుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

07-05-2021
May 07, 2021, 11:05 IST
న్యూఢిల్లీ: ఇటీవల ఆటగాళ్లకి కరోనా వైరస్‌ సోకడంతో అనూహ్యంగా ఐపీఎల్‌ 2021 ని బీసీసీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. పక్కాగా జాగ్రత్తలు తీసుకుని, ఆటగాళ్లను బయోబబుల్‌లో...
04-04-2021
Apr 04, 2021, 19:54 IST
ముంబై: ఐపీఎల్‌-14వ సీజన్‌ ఇంకా మరికొద్ది రోజుల్లో ఆరంభం కానున్న తరుణంలో ఆయా ఫ్రాంచైజీల ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను ముమ్మరం...
31-01-2021
Jan 31, 2021, 01:31 IST
ముంబై: ఐపీఎల్‌–2021ను నిర్వహించే విషయంలో ప్రత్యామ్నాయ వేదిక గురించి అసలు తాము ఏమాత్రం ఆలోచించడం లేదని బీసీసీఐ కార్యదర్శి అరుణ్‌...
05-01-2021
Jan 05, 2021, 14:47 IST
ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్‌ అజిత్‌ సింగ్‌ ధ్రువీకరించారు.
21-12-2020
Dec 21, 2020, 14:23 IST
మన రాష్ట్రంలో 41 శాతం మంది మాత్రమే దీని ఆరా తీశారు. తెలంగాణలో మన కంటె ఒక్క శాతం ఎక్కువ...
23-11-2020
Nov 23, 2020, 14:53 IST
ఈ టీ20 లీగ్‌లో 53 రోజులపాటు మొత్తంగా 60 మ్యాచ్‌లు జరిగాయి. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా 1800 మందికి...
19-11-2020
Nov 19, 2020, 17:11 IST
టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా మాత్రం కేఎల్‌ రాహుల్‌ పూర్తిస్థాయిలో తన సామర్థ్యాన్ని వినియోగించుకోలేదని అభిప్రాయపడ్డాడు.
17-11-2020
Nov 17, 2020, 18:58 IST
న్యూఢిల్లీ: ఐపీఎల్‌ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఈసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌(సీఎస్‌కే) ఘోరపరాభవం పొందిన విషయం తెలిసిందే. 2011లో తన స్కిల్స్‌తో టీమిండియాకు ప్రపంచ కప్‌...
15-11-2020
Nov 15, 2020, 19:37 IST
రెండున్నర నెలలపాటు క్రికెట్‌ అభిమానులను అలరించిన ఐపీఎల్‌ 2020 నిర్వహణకు సంబంధించి యూఏఈకి బీసీసీఐ భారీ మొత్తంలోనే ముట్టజెప్పినట్టు జాతీయ...
12-11-2020
Nov 12, 2020, 20:06 IST
టీమిండియా ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యాకు భారీ షాక్‌ తగిలింది.
12-11-2020
Nov 12, 2020, 05:02 IST
ప్రతీ ఐపీఎల్‌కు ఒక కథ ఉంటుంది... ఈ సారి ఐపీఎల్‌ది అన్నింటికంటే భిన్నమైన కథ... కరోనా ఐపీఎల్‌ను ఆపేస్తుందని అంతా...
11-11-2020
Nov 11, 2020, 12:25 IST
అభిమానులు రవిశాస్త్రి తీరును ఎండగట్టారు. కావాలనే దాదాపేరును ప్రస్తావించలేదని తిట్టిపోస్తున్నారు.
11-11-2020
Nov 11, 2020, 10:26 IST
బెత్తం పట్టుకొని బాగా ఆడమనే రకం కాదు నేను. ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం నింపడమే కెప్టెన్‌గా నా పని. అందరూ బాగా...
11-11-2020
Nov 11, 2020, 08:43 IST
కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్, హెడ్‌ కోచ్‌గా అనిల్‌ కుంబ్లేను కొనసాగించేందుకు సిద్ధమైంది. రాహుల్‌ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు.
11-11-2020
Nov 11, 2020, 04:26 IST
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో ముంబై ఇండియన్స్‌ అప్రతిహత జైత్రయాత్ర... ప్రత్యర్థి ఎవరైనా నిర్దాక్షిణ్యమైన ఆటతీరును కనబర్చిన ఈ జట్టు...
10-11-2020
Nov 10, 2020, 22:55 IST
దుబాయ్‌: డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌  మళ్లీ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. వేదిక ఏదైనా టైటిల్‌ వేటలో తమకు...
10-11-2020
Nov 10, 2020, 21:19 IST
దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 157 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది....
10-11-2020
Nov 10, 2020, 19:59 IST
దుబాయ్‌: ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ స్టార్‌ పేసర్‌ బౌల్ట్‌ తొలి...
10-11-2020
Nov 10, 2020, 19:10 IST
దుబాయ్‌: ఈ సీజన్‌ ఐపీఎల్‌ టైటిల్‌ కోసం ముంబై ఇండియన్స్‌-ఢిల్లీ క్యాపిటల్స్‌లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. నాలుగు టైటిల్స్‌ గెలిచిన ముంబై...
10-11-2020
Nov 10, 2020, 18:24 IST
కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన క్రికెట్‌ అభిమానులకు అసలైన మజా ఇస్తున్న ఐపీఎల్‌ చివరి దశకు చేరుకుంది. నేటి ఫైనల్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top