భారత ‘ఎ’ జట్టులో షబ్నమ్, యశశ్రీ | Shabnam and Yasashree in India A team | Sakshi
Sakshi News home page

భారత ‘ఎ’ జట్టులో షబ్నమ్, యశశ్రీ

Jul 15 2024 3:07 AM | Updated on Jul 15 2024 3:07 AM

Shabnam and Yasashree in India A team

ముంబై: వచ్చే నెలలో ఆ్రస్టేలియాలో ఆ్రస్టేలియా ‘ఎ’ మహిళల క్రికెట్‌ జట్టుతో సిరీస్‌లో పాల్గొనే భారత ‘ఎ’ జట్టును ప్రకటించారు. 18 మంది సభ్యులతో కూడిన భారత ‘ఎ’ జట్టుకు కేరళకు చెందిన ఆఫ్‌ స్పిన్నర్‌ మిన్ను మణి కెప్టెన్ గా వ్యవహరిస్తుంది. 

ఆంధ్రప్రదేశ్‌ పేస్‌ బౌలర్‌ షబ్నమ్‌ షకీల్, హైదరాబాద్‌ అమ్మాయి సొప్పదండి యశశ్రీలకు కూడా భారత ‘ఎ’ జట్టులో చోటు లభించింది. ఆగస్టు 7 నుంచి 25 వరకు జరిగే ఈ సిరీస్‌లో ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టుతో టీమిండియా మూడు టి20లు, మూడు వన్డేలు, ఒక నాలుగు రోజుల మ్యాచ్‌ ఆడుతుంది.  

భారత ‘ఎ’ జట్టు: మిన్న మణి (కెప్టెన్ ), శ్వేత సెహ్రావత్‌ (వైస్‌ కెప్టెన్ ), ప్రియా పూనియా, శుభ సతీశ్, తేజల్‌ హసబీ్నస్, కిరణ్‌ నవ్‌గిరే, సజన, ఉమా చెత్రి, శిప్రా గిరి, రాఘవి బిష్త్, సైకా ఇషాక్, మన్నత్‌ కశ్యప్, తనుజా కన్వర్, ప్రియా మిశ్రా, మేఘన సింగ్, సయాలీ సట్గరే, షబ్నమ్‌ షకీల్, యశశ్రీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement