IPL 2022: యూపీ సీఎంతో కేఎల్ రాహుల్ జ‌ట్టు ఓన‌ర్ భేటీ

Sanjiv Goenka, Gautam Gambhir Gift Lucknow Super Giants First Bat To UP CM Yogi Adityanath - Sakshi

LSG Owner Meets UP CM: ఐపీఎల్ 2022లో కొత్త‌గా ఎంట్రీ ఇచ్చిన‌ లక్నో సూప‌ర్ జెయింట్స్‌ (ఎల్ఎస్‌జీ).. సీజ‌న్ ప్రారంభానికి ముందు ఫ్రాంచైజీ హెడ్ క్వార్ట‌ర్స్‌కు సంబంధించి కీల‌క వ్య‌క్తితో భేటీ అయ్యింది. శ‌నివారం ఎల్ఎస్‌జీ అధినేత  సంజీవ్ గొయెంకా, జట్టు మెంటార్‌, ఢిల్లీ ఎంపీ గౌతం గంభీర్‌తో కలిసి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా కలిశారు.  

సీఎంతో భేటీ సందర్భంగా సంజీవ్ గొయెంకా, గంభీర్ లు యోగితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా వారు ముఖ్య‌మంత్రికి ఫ్రాంచైజీ తొలి బ్యాట్‌ను అందజేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలో బిజీబిజీగా గ‌డుపుతున్న‌ యోగి.. సంజీవ్ గొయెంకా, గంభీర్‌ల‌తో భేటీ కావ‌డం ప్రాధాన్యత‌ సంతరించుకుంది. యోగికి బ్యాట్‌ అందజేస్తున్న ఫోటోను ఎల్ఎస్‌జీ త‌మ అధికారిక‌ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది.

ఇదిలా ఉంటే, రిటెన్షన్‌లో భాగంగా కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్ లను రిటైన్ చేసుకున్న ఎల్ఎస్‌జీ.. వేలంలో 69 కోట్లు వెచ్చించి మ‌రో 18 మంది ఆట‌గాళ్ల‌ను సొంతం చేసుకుంది.  వేలంలో ఎల్ఎస్‌జీ అత్య‌ధికంగా అవేశ్ ఖాన్‌కు రూ. 10 కోట్లు చెల్లించి ద‌క్కించుకుంది. ఆ త‌ర్వాత జేసన్ హోల్డర్‌కు 8.75 కోట్లు, కృనాల్ పాండ్యాల‌పై 8.25 కోట్లు వెచ్చించింది. 

లక్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టు:

కేఎల్‌ రాహుల్‌(కెప్టెన్‌):   రూ. 17 కోట్లు 
స్టోయినిస్‌ :       రూ. 9 కోట్ల 20 లక్షలు 
అవేశ్‌ ఖాన్‌ :     రూ. 10 కోట్లు  
హోల్డర్‌ :     రూ. 8 కోట్ల 75 లక్షలు 
కృనాల్‌ పాండ్యా :     రూ. 8 కోట్ల 25 లక్షలు 
మార్క్‌ వుడ్‌ :     రూ. 7 కోట్ల 50 లక్షలు 
డికాక్‌ :     రూ. 6 కోట్ల 75 లక్షలు 
దీపక్‌ హుడా : రూ. 5 కోట్ల 75 లక్షలు 
మనీశ్‌ పాండే:  రూ. 4 కోట్ల 60 లక్షలు 
రవి బిష్ణోయ్‌  : రూ. 4 కోట్లు 
ఎవిన్‌ లూయిస్‌:  రూ. 2 కోట్లు 
దుశ్మంత చమీర:     : రూ. 2 కోట్లు 
కృష్ణప్ప గౌతమ్‌:     రూ. 90 లక్షలు 
అంకిత్‌ రాజ్‌పుత్‌:     రూ. 50 లక్షలు 
షాబాజ్‌ నదీమ్‌:  రూ. 50 లక్షలు 
కైల్‌ మేయర్స్‌:  రూ. 50 లక్షలు 
మోసిన్‌ఖాన్‌    :  రూ. 20 లక్షలు 
ఆయుశ్‌ బదోని:  రూ. 20 లక్షలు 
కరణ్‌ సన్నీ శర్మ:  రూ. 20 లక్షలు 
మయాంక్‌ యాదవ్‌    రూ. 20 లక్షలు 
మనన్‌ వోహ్రా: రూ. 20 లక్షలు 
చ‌ద‌వండి: IPL 2022 Auction: కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీ.. లక్నో సూపర్‌ జెయింట్స్‌ జట్టు ఇదే
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top