Gambhir-Dhoni: అరె ధోని, గంభీర్.. ఎన్నాళ్లకెన్నాళ్లకు

క్రికెట్‌లో కొన్ని సంఘటనలు మరిచిపోలేనివిగా మిగిలిపోతాయి. కొన్నిసార్లు అలాంటివి చూస్తే చాలు మనకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. తాజాగా ఐపీఎల్ 2022 ఒక అద్భుత దృశ్యానికి వేదికగా నిలిచింది. ఆట రెండు జట్ల మధ్య జరిగినప్పటికి ఆ ఇద్దరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలచారు. వారే ఎంఎస్ ధోని, గౌతమ్ గంభీర్.
విషయంలోకి వెళితే.. గురువారం రాత్రి సీఎస్‌కే, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ఫలితం పక్కనబెడితే.. ధోని, గంభీర్‌లు చాలా రోజుల తర్వాత కలుసుకోవడం ఆసక్తి కలిగించింది. ఎందుకంటే గంభీర్ క్రికెట్‌కు దూరమైనప్పటి నుంచి ధోనిని కలిసిన దాఖలాలు పెద్దగా లేవనే చెప్పాలి. కానీ గురువారం రాత్రి మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని ఆవేశ్ ఖాన్‌తో మాట్లాడుతుండగా.. గంభీర్ అక్కడికి వచ్చాడు. తన మాజీ కెప్టెన్‌తో కాసేపు చర్చించాడు. ఒకప్పుడు టీమిండియా తరపున ఆటగాళ్లుగా ప్రాతినిధ్యం వహించిన ఈ ఇద్దరు ఇప్పుడు మెంటార్‌గా వ్యవహరిస్తున్నారు.
అందులో ధోని అటు ఆటగాడిగాను.. మెంటార్‌గానూ సీఎస్‌కేను నడిపిస్తుండగా.. గంభీర్ ఈ ఏడాది లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. నిజానికి వారిద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ.. ధోని, గంభీర్‌లు చాలాకాలం తర్వాత కలవడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు. ఇక గంభీర్ కూడా ధోనిని కలిసిన విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నాడు. ''నా కెప్టెన్‌ను కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది'' అంటూ ఫోటో షేర్ చేస్తూ క్యాప్షన్ జత చేశాడు. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అంతేగాక లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్‌గా గంభీర్ తన పాత్రను సమర్థవంతంగా పోషించాడనే చెప్పాలి. చేజింగ్‌లో లక్నో వెనుకబడ్డ ప్రతీసారి బూస్టప్ ఇచ్చే ప్రయత్నం చేశాడు. అంతకముందు ఫీల్డింగ్ సమయంలోనూ కెప్టెన్ రాహుల్ వద్దకు వచ్చి సూచనలు ఇచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.
ఇక గంభీర్, ధోనిల కెరీర్ దాదాపు ఒకేసారి మొదలైంది. ధోని కెప్టెన్సీలో గంభీర్ చాలా మ్యాచ్‌లు ఆడాడు. ముఖ్యంగా ధోని నాయకత్వంలో టీమిండియా 2007 టి20, 2011 వన్డే ప్రపంచకప్ గెలవడంలో గంభీర్ పాత్ర కీలకం. ఆ రెండు ఫైనల్ సందర్భాల్లోనూ గంభీర్ కీలక ఇన్నింగ్స్‌లతో మెరిశాడు. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ధోని దనాధన్ ఇన్నింగ్స్‌కు క్రేజ్ ఉన్నప్పటికి గంభీర్ ఇన్నింగ్స్‌ను తీసిపారేయలేము. ఆరోజు గంభీర్ గనుక మంచి ఆరంభం ఇయ్యకపోయుంటే కచ్చితంగా పరిస్థితి వేరుగా ఉండేది. ఆ తర్వాత గంభీర్, ధోనిలు ప్రత్యర్థులుగా ఐపీఎల్‌లో ఎదురుపడ్డారు. 2012 ఐపీఎల్ ఫైనల్లో కేకేఆర్ సీఎస్‌కేను ఓడించి విజేతగా నిలిచింది. హ్యాట్రిక్ టైటిల్స్ సాధించాలన్న సీఎస్‌కే కోరికకు గంభీర్ సేన అడ్డుపడింది. ఆ తర్వాత 2014లోనూ మళ్లీ గంభీర్ నేతృత్వంలోనే కేకేఆర్ రెండోసారి టైటిల్ అందుకుంది.
చదవండి: Suresh Raina: ‘క్రికెట్’కు గుడ్‌బై చెప్పనున్న సురేష్ రైనా!?
IPL 2022: ఫీల్డ్ సెట్ చేసిన ధోని.. వైరల్
Gautam Gambhir & MS Dhoni 😭❤️
That's the tweet#MSDhoni𓃵 #CSKvsLSG pic.twitter.com/KcyNHoS8Pd
— Arth Vaishnav EF (@ArthVaishnav) March 31, 2022
Courage @LucknowIPL pic.twitter.com/FKcUewgPDE
— K L Rahul (@klrahul11) March 31, 2022
మరిన్ని వార్తలు