ఫిన్లాండ్‌తో ‘డేవిస్‌’ పోరుకు బోపన్న

Rohan Bopanna retains place in Indian team for Davis Cup - Sakshi

సీనియర్‌ టెన్నిస్‌ స్టార్‌ రోహన్‌ బోపన్న భారత డేవిస్‌ కప్‌ జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇటీవల అఖిల భారత టెన్నిస్‌ సంఘంతో ఒలింపిక్స్‌ విషయమై బోపన్న గొడవ పడ్డాడు. ఇది పతాక స్థాయికి చేరడంతో అతన్ని భవిష్యత్తులో జట్టులోకి ఎంపిక చేయరనే వార్తలు వచ్చాయి. అయితే సెప్టెంబర్‌ 17, 18 తేదీల్లో ఫిన్లాండ్‌ వేదికగా ఫిన్లాండ్‌తో జరిగే వరల్డ్‌ గ్రూప్‌–1 పోరులో పాల్గొనే భారత జట్టులో బోపన్నను ఎంపిక చేశారు. ఈ పోటీలో డబుల్స్‌లో దివిజ్‌ శరణ్‌–బోపన్న జంట ఆడుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top