చిన్నస్వామి సాక్షిగా.. ఆ 11 మందికి ఆర్సీబీ ఘన నివాళి! | RCB, KSCA Announce Special Tribute For Chinnaswamy Stampede Victims In IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: చిన్నస్వామి సాక్షిగా.. ఆ 11 మందికి ఆర్సీబీ ఘన నివాళి!

Mar 24 2026 12:22 PM | Updated on Mar 24 2026 12:43 PM

RCB, KSCA Announce Special Tribute For Chinnaswamy Stampede Victims In IPL 2026

ఐపీఎల్‌-2026 మ‌రో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో మార్చి 28న‌ చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు, సన్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ (KSCA), ఆర్సీబీ యాజ‌మాన్యం కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాయి.

గతేడాది జరిగిన 'చిన్నస్వామి స్టేడియం తొక్కిసలాట' బాధితుల జ్ఞాపకార్థం కొన్ని ప్రత్యేక​ కార్యక్రమాలను కేఎస్‌సీఎ, ఆర్సీబీ సంయుక్తంగా నిర్వహించనున్నాయి. కాగా గ‌తేడాది చిన్న‌స్వామి స్టేడియం వ‌ద్ద జ‌రిగిన ఆర్సీబీ విజయోత్స‌వ వేడుకలు విషాదంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌లో మొత్తం మంది అభిమానులు ప్రాణాలు విడిచారు.

దీంతో  ఆ 11 మంది అభిమానుల జ్ఞాపకార్థం.. స్టేడియంలోని ఒక స్టాండ్‌లో 11 సీట్లను శాశ్వతంగా ఖాళీగా ఉంచాలని క‌ర్ణాట‌క క్రికెట్ అసోసియేష‌న్ నిర్ణ‌యించింది. ఈ సీట్లను ఇకపై ఏ ఐపీఎల్ మ్యాచ్‌కు గానీ, అంతర్జాతీయ మ్యాచ్‌కు గానీ విక్రయించరు. అదేవిధంగా స్టేడియంలో ప్రధాన ఎంట్రెన్స్ ద్వారం వద్ద స్మారక చిహ్నాన్ని ఆవిష్కరించనున్నారు.

మార్చి 28న మ్యాచ్ ప్రారంభానికి ముందే కేఎస్‌సీఏ ప్రెసిడెంట్ వెంకటేష్ ప్రసాద్ దీన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మ్యాచ్ ఆరంభానికి ముందు స్టేడియం మొత్తం ఒక నిమిషం పాట మౌనం పాటిస్తారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌, ఆర్సీబీ జట్లు నల్లటి బ్యాండ్‌లు భుజానికి ధరించి బరిలోకి దిగనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. 

కాగా ఆర్సీబీ మేనేజ్‌మెంట్ ఇప్పటికే రూ. 25 లక్షల చొప్పున ఆర్ధిక సహాయాన్ని బాధితుల కుటుంబాలకు అందజేసింది. అయితే ఈ విషాద సంఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జరగనున్న తొలి మ్యాచ్ ఇదే కావడం గమానార్హం.
చదవండి: IND vs SA: సౌతాఫ్రికా టూర్‌కు భారత జట్టు ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement