‘ప్లేయర్‌ ఆఫ్‌ ఇయర్‌’ రేసులో హార్దిక్, నవ్‌నీత్‌ కౌర్‌ | Hardik, Abhishek in fray for Hockey India Player of the Year award | Sakshi
Sakshi News home page

‘ప్లేయర్‌ ఆఫ్‌ ఇయర్‌’ రేసులో హార్దిక్, నవ్‌నీత్‌ కౌర్‌

Mar 24 2026 11:42 AM | Updated on Mar 24 2026 11:51 AM

Hardik, Abhishek in fray for Hockey India Player of the Year award

న్యూఢిల్లీ: భారత హాకీ స్టార్‌ మిడ్‌ ఫీల్డర్‌ హార్దిక్‌ సింగ్, ఫార్వర్డ్‌ ప్లేయర్లు సుఖ్‌జీత్‌ సింగ్, సంజయ్‌లతో పాటు డిఫెండర్‌ అభిషేక్‌ హాకీ ఇండియా (హెచ్‌ఐ) ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డు రేసులో ఉన్నారు. హెచ్‌ఐ వార్షిక అవార్డుల్లో ఈ నలుగురు హాకీ దిగ్గజం బల్బీర్‌ సింగ్‌ సీనియర్‌ పేరిట ప్రదానం చేసే ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డుకు నామినేట్‌ అయ్యారు.

మహిళల కేటగిరీలో ఈ అవార్డు కోసం సలీమా టెటె, నవ్‌నీత్‌ కౌర్, లాల్‌రెమ్‌సియామి, సవిత పోటీపడుతున్నారు. న్యూఢిల్లీలో ఈ శుక్రవారంఅట్టహాసంగా అవార్డుల వేడుక నిర్వహించేందుకు హాకీ ఇండియా ఏర్పాట్లు చేస్తోంది. మహిళలు, పురుషుల సీనియర్‌ కేటగిరీలతో పాటు వర్ధమాన క్రీడాకారుల ప్రతిభకు పట్టం కట్టేలా అండర్‌–21 విభాగంలోనూ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌’ అవార్డులు ప్రదానం చేయనుంది. మొత్తం ఎనిమిది కేటగిరీల్లో అవార్డులు ఇస్తారు.

దీని కోసం 32 మంది నామినీలతో తుది జాబితాను సిద్ధం చేశారు. ఒక్కో కేటగిరీ నుంచి ఒక్కో విజేతను శుక్రవారం వేడుకలో ప్రకటిస్తారు. జీవిత సాఫల్య పురస్కారంగా ప్రెసిడెంట్‌ అవార్డు, ఆటగాళ్లతో పాటు అంపైర్, మేనేజర్, టెక్నికల్‌ అఫీషియల్‌ అవార్డులు కూడా ఉంటాయి. ఈ అవార్డుల వేడుకలోనే ఆసియా కప్‌లో విజేతగా నిలిచిన సీనియర్‌ పురుషులు జట్టును, జూనియర్‌ ప్రపంచకప్‌లో కాంస్యం గెలిచిన జట్టును ఘనంగా సన్మానించనున్నట్లు హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీ చెప్పారు.  

అవార్డులకు ఎంపికైన నామినీలు 
గోల్‌కీపర్‌ ఆఫ్‌ ద ఇయర్‌: ప్రిన్స్‌దీప్‌ సింగ్, కిషన్‌ బహదూర్, బిచూ దేవి కరిబం, సూరజ్‌ కర్కేరా. 

డిఫెండర్‌ ఆఫ్‌ ద ఇయర్‌: సంజయ్, అమిత్‌ రోహిదాస్, జుగ్‌రాజ్‌ సింగ్, హర్మన్‌ప్రీత్‌ సింగ్‌. 

మిడ్‌ ఫీల్డర్‌ ఆఫ్‌ ద ఇయర్‌: హార్దిక్‌ సింగ్, సుమిత్, రాజ్‌ కుమార్‌ పాల్, నీలకంఠ శర్మ. 

ఫార్వర్డ్‌ ఆఫ్‌ ద ఇయర్‌: సుఖ్‌జీత్, అభిషేక్‌, నవ్‌నీత్‌ కౌర్, శిలానంద్‌ లాక్రా. 

ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (అండర్‌–21 అమ్మాయిలు): సాక్షి రాణా, జ్యోతి సింగ్, సునెలితా టొప్పో, కనిక సివచ్‌. 

ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (అండర్‌–21 పురుషులు): ప్రిన్స్‌ దీప్, మన్‌మీత్, అన్‌మోల్‌ ఎక్కా, అర్‌‡్షదీప్‌ సింగ్‌. 

ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (మహిళలు): నవ్‌నీత్‌ కౌర్, సలీమా టెటె, లాల్‌రెమ్‌సియామి, సవిత. 

ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (పురుషులు): హార్దిక్‌ సింగ్, సుఖ్‌జీత్, సంజయ్, అభిషేక్‌.   

Advertisement
 
Advertisement
Advertisement