‘అతడు ఇలాగే రెచ్చిపోతే మా పని సులువు’ | Rajasthan Royals Captain Riyan Parag Comments Match Won Vs RCB | Sakshi
Sakshi News home page

‘అతడు ఇలాగే రెచ్చిపోతే మా పని సులువు’

Apr 11 2026 8:15 AM | Updated on Apr 11 2026 9:18 AM

Rajasthan Royals Captain Riyan Parag Comments Match Won Vs RCB

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నది. శుక్రవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్ మెరుపు ఇన్నింగ్స్‌లతో రాజస్తాన్ సునాయాసంగా గెలుపొందింది.  

మ్యాచ్ ముగిసిన అనంతరం రియాన్ పరాగ్ మాట్లాడుతూ.. వరుసగా నాలుగు విజయాలు సాధించడం సంతోషంగా అనిపిస్తున్నప్పటికీ బౌలింగ్‌లో మెరుగుపడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. పరాగ్ మాట్లాడుతూ.. ‘గత కొన్నేళ్లుగా ఈ వేదికపై మా రికార్డు అంత ఆశాజనకంగా లేదు, కానీ ఈరోజు ఆట తీరు బాగుంది. అయితే బౌలర్లు ఇంకాస్త క్రమశిక్షణతో వ్యవహరించాల్సి ఉంది. ప్రత్యర్థి జట్టు 200 పరుగులు చేసేలా కనిపించినా.. మధ్య ఓవర్లలో వికెట్లు తీసి వారిని కట్టడి చేశాం. 

కానీ నిజానికి వారిని 170 పరుగుల లోపే నియంత్రించి ఉండాల్సింది. కెప్టెన్‌గా నేను కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా. మా బౌలర్లు కొన్ని సందర్భాల్లో బ్యాటర్లకు అవకాశం ఇవ్వడం వారికి అనుకూలంగా మారింది. గౌహతి, జైపూర్‌లలో మేము చేసిన ముందస్తు సన్నద్ధత ఇక్కడ పనిచేసింది. గ్రౌండ్‌పై ఉన్న నల్లమట్టి పిచ్ ఎలా ప్రవర్తిస్తుందనేది మాకు ముందే తెలుసు. 

పరిస్థితులకు అనుగుణంగా మారడమే ఒక జట్టుగా మా లక్ష్యం. ఇప్పటివరకు మేము స్టిక్కీ పిచ్‌లపై ఆడాము, బ్యాటింగ్‌కు అనుకూలమైన 'బెల్టర్' పిచ్ లభిస్తే మా ఆట ఇంకా అద్భుతంగా ఉంటుంది. వైభవ్ జట్టులో అందరికీ ఇష్టమైన వ్యక్తి. అతను ఇంకా చిన్న పిల్లాడు, అతనికి బయట తిరగడం, రకరకాల ఆహార పదార్థాలు తినడం అంటే చాలా ఇష్టం. 

మేము అతనికి కావాల్సినవన్నీ ఏర్పాటు చేస్తాము. అన్నింటికంటే ముఖ్యంగా అతనికి బ్యాటింగ్ అంటే పిచ్చి ప్రేమ. వైభవ్ విధ్వంసం ఇలాగే కొనసాగితే మా పని సులువైపోతుంది.’ అని చెప్పుకొచ్చాడు. 

చదవండి: ‘బంతి మీదే దృష్టి.. బౌల‌ర్ వైపు క‌న్నెత్తి చూడ‌ను!’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement